మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం క్రాక్. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన క్రాక్ మూవీ ఈ నెల 9న రిలీజైంది. ఫైనాన్సియల్ ప్రాబ్లమ్ వలన మార్నింగ్ షోలు, మ్యాట్నీపడకపోయినా.. ఫస్ట్ షో నుంచి క్రాక్ థియేటర్లోకి వచ్చింది. అనుకున్నటైమ్ కి ఆలస్యంగా అయినా థియేటర్లోకి వచ్చినా…క్రాక్ మూవీ సక్సస్ టాక్ ని మాత్రం తెచ్చుకుంది.

ఈ సక్సస్ టాక్ కి తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందంటే.. నైజాం – 2.28 కోట్లు, సీడెడ్ – 1 కోటి, ఉత్తరాంథ్ర – 85 లక్షలు, ఈస్ట్ – 48లక్షలు, వెస్ట్ – 28 లక్షలు, గుంటూరు 65 లక్షలు, కృష్ణ – 45 లక్షలు, నెల్లూరు – 26 లక్షలు, టోటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6.25 షేర్ రాబట్టగా, గ్రాస్ 10.56 కోట్లు వసూలు చేసింది. 50శాతం సిటింగ్ ఆక్యుపెన్సీతో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
Must Read ;- ‘క్రాక్’ వీరశంకర్ వీరబాదుడు (రివ్యూ)











