తమిళ స్టార్ హీరో సూర్య.. విభిన్నతకు కేరాఫ్ అడ్రెస్ . ఆయన సినిమాలకు తమిళనాటే కాదు తెలుగునాట కూడా మంచి డిమాండ్ ఉంది. అందరిలోనూ మంచి ఆసక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్న సూర్య లేటెస్ట్ గా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 12న దీపావళి కానుకగా అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కథానాయకుడు సూర్య.. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలోని పాత్ర చేసేందుకు దారి తీసిన పరిస్థితులపై.. ఆ సినిమా కథ వెనుకనున్న ఆసక్తికరమైన అంశాల్ని రీసెంట్ గా జరిగిన మీడియా ఇంట్రాక్షన్ లో తెలిపారు.
ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో రాబోతున్నానని, ఈ సినిమా నటుడిగా తనకి చాలా ప్రత్యేకమైనదని చెప్పారు సూర్య. అలాగే.. పదేళ్ళ క్రితమే దర్శకురాలు సుధాకొంగరకి ఈ సినిమా లైన్ మీద ఐడియా ఉంది. మూడేళ్ళ క్రితం కలిసినప్పుడు ఈ లైన్ గురించి డిస్కస్ చేశామని.. ఇక అప్పట్నుంచి ఈ సినిమాకి సంబంధించిన పని మొదలైందని సూర్య తెలిపారు.
ఓ అసాధారణమైన కలని ఓ సాధారణ వ్యక్తి ఎలా సాకరం చేసుకున్నాడు అనేదే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా కథ. ఓ స్కూల్ మాస్టర్ కొడుకు గోపీనాథ్. అయితే విమాన రంగంలో తానేమిటో నిరూపించుకోవాలని కలలు కన్నారు. ఆ కలలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. వాటిని ఎలా ఫేస్ చేశారు? చివరికి తాను అనుకున్నది ఎలా సాధించాడు అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని సూర్య చెప్పారు.
ఇక ఈ సినిమాని ట్రాక్ ఎక్కిద్దామని అనుకున్నప్పుడు ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్‌గారిని బెంగుళూరులో కలిశామని. ఆయనతో కూలంకషంగా చర్చించామని. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళ గురించి చెబుతున్నప్పుడు తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని. చాలా ఇన్‌స్ప్రైరింగ్‌గా ఉందని. ఒక్కమాటలో చెప్పాలంటే మీ లక్ష్యాలను గుర్తు చేసే సినిమా అని సూర్య చెబుతున్నారు.
ఇంకా దర్శకురాలు సుధ కొంగర గురించి చెబుతూ… మణిరత్నం ‘యువ’ టైమ్‌లో తాను సుధా కొంగరను కలిశానని. ప్రతిషాట్‌కు మణిరత్నంగారినే కాదు, సుధా కొంగరను కూడా నటుడిగా సంతృప్తి పరచాల్సి వచ్చిందని చెప్పారు. అలా సుధకి, తనకి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని. ‘గురు’ సినిమా చూసిన తర్వాత ఆమెతో పనిచేయాలనుకున్నా. లక్కీగా ఆమె మైండ్‌లోనూ ఈ లైన్ రన్ అవడంతో అన్నీ కలిశాని చెప్పారు.
అలాగే.. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించిన విలక్షణ నటుడు మోహన్‌బాబు తనకి మెంటర్ అని .. ఆయన చాలా చాలా గ్రేట్ పర్సన్ అని ఆయన అన్నారు . కథ విన్న రోజునే, తన కోసం ఈ సినిమా చేస్తానని ఆయన చెప్పారని సూర్య అంటున్నారు . ఆయన ఎంతో సీనియర్ రజినీకాంత్ వంటి స్టార్స్ తో కలిసి ట్రావెల్ చేశారు. పాత్రకు, డైరెక్టర్‌కు ఆయన సరెండరై నటించిన విధానం సింప్లీ సూపర్. పరేష్‌రావెల్‌గారు కూడా అంతే. వీళ్లందరూ లెజెండ్రీ యాక్టర్స్ అని సూర్య తెలిపారు. ఇక తాను నటిస్తోన్న మొట్టమొదటి బయోపిక్ మూవీ ఇదేనని సూర్య అంటున్నారు.
ఇక చివరిగా చెబుతూ.. ఈ సినిమాను బాలీవుడ్ లో కి రీమేక్ చేయాలా, డబ్ చేయాలని అని ఆలోచిస్తున్నామని .. ఆ విషయం ప్రస్తుతం చర్చల్లో ఉందని అంటున్నారు సూర్య. మరి సూర్యకి ఆకాశం నీ హద్దురా ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.











