సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం లైగర్. ఇటీవల ఈ మూవీ టైటిల్ అండ్ పోస్టర్ రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. ఈ టైటిల్ కి ఊహించిన దానిక కంటే ఎక్కువుగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో రెట్టించిన ఉత్సాహాంతో లైగర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రజెంట్ ముంబాయిలో ఉన్న పూరి లైగర్ తాజా షెడ్యూల్ ను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబాయిలోనే తాజా షెడ్యూల్ షూటింగ్ చేయనున్నారు. ముంబాయి షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత విదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు లైగర్ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక ఈ మూవీ రిలీజ్ విషయానికి వస్తే.. మూడు నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసారని సమాచారం.
సమ్మర్ లో సినిమాలు వచ్చి వెళ్లిపోయిన తర్వాత లైగర్ రిలీజ్ చేయనున్నారు. ఇంతకీ ఎప్పుడంటే.. ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ చేసిన జులైలో లైగర్ ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని పూరి – ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి కన్నా విజయ్ దేవరకొండకు ఈ సినిమా సక్సస్ చాలా అవసరం. మరి.. లైగర్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Must Read ;- ‘లైగర్’ గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడు