సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో మెప్పించి.. అగ్ర స్థానానికి ఎదిగిన కథానాయిక కాజల్ అగర్వాల్. దాదాపు పద్నాలుగేళ్ళ క్రితం టాలీవుడ్ లో కథానాయికగా పరిచయమైన ఆమె.. తొలి సినిమా నిరాశపరిచినా.. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అందాల చందమామ గా మారిన తీరు ఎవరికైనా ఇన్ స్పిరేషన్ కలిగించేదే. సౌత్ ఇండస్ట్రీలోని దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన అమ్మడు.. మీడియమ్ రేంజ్ హీరోలతో కూడా రొమాన్స్ కు సిద్ధమవడం ఆమె స్పోర్టివ్ నెస్ కు నిదర్శనం.
ఇటీవల తన మనసుకు నచ్చిన గౌతమ్ కిచ్లూని మనువాడిన కాజల్ .. సినిమాల్లో నటించడం మాత్రం మానకపోవడం అభిమానులకు ఎంతగానో సంతోషం కలిగించింది. ప్రస్తుతం ఆచార్య , ఇండియన్ 2, పారిస్ పారిస్ లాంటి ప్రాజెక్ట్స్ లో నటిస్తోన్న కాజల్ .. ఈ లాక్ డౌన్ టైమ్ ను చాలా చక్కగా వినియోగించుకుంటోంది. తన భర్త గౌతమ్ కిచ్లూతో తన వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ.. ముందుకు సాగుతోంది.
తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోస్ .. నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భర్త గౌతమ్ బిగి కౌగిళ్ళల్లో బంధీ అయిన పోజులతో ఇన్ స్టాను నింపేసింది. ఈ ఫోటోస్ కి నెటిజెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లైన దగ్గర నుంచి చందమామ మోములో ఎప్పుడూ నవ్వు నాట్యమాడుతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆమె నిత్యం అలా నవ్వుతూ ఉంచడం గౌతమ్ కిచ్లూ దినచర్యల్లో ఒకటిగా మారిందన్నది వాస్తవం. మరి ఈ ఆదర్శ దంపతులు ఇంకెందరికి ఇన్ స్పిరేషన్ గా మారతారో చూదాలి.
Must Read ;- ‘మోసగాళ్ళు’ పాప బికినీ షో చూతము రారండి.. !