పూలధారను .. పాలధారను వేరు వేరుగా చూసి ఉంటారుగానీ, ఒక్కటిగా చూడనివాళ్లు చాలామందే ఉండి ఉంటారు. వాళ్లంతా కూడా ‘అరే .. మనం చూడలేదే’ అని బాధపడవలసిన పనిలేదు. అందుకు బదులుగా ప్రగ్యా జైస్వాల్ ను చూస్తే సరిపోతుంది. ప్రగ్యా జైస్వాల్ మంచి మోడల్ .. గ్లామరస్ హీరోయిన్. ప్రగ్యా తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ‘కంచె’ తరువాత ఆ స్థాయిలో ఆమెకి గుర్తింపు తెచ్చిన సినిమా పడలేదు. అయినా ఆమె తెలుగుతో పాటు ఇతర భాషల్లో కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే హిందీలో సల్మాన్ సినిమాలోను .. తెలుగులో పవన్ సినిమాలోను ఆమె పేరు వినిపిస్తోంది. ఒక వైపున వీలైనన్ని అవకాశాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున వాణిజ్య ప్రకటనల్లోను మెరుస్తోంది. తాజాగా డీజిల్ బ్రాండ్ స్పోర్ట్స్ బ్రా ను ధరించి, మన్మథుడికే మతిపోగోట్టే భంగిమ పెట్టేసింది. తన ఇన్ స్టా గ్రామ్ వాల్ పై పోస్ట్ చేసింది .. కూల్ గా కుర్రాళ్ల హార్టు బీట్ ను పెంచేసింది. ఆమె చూపుల్లోని మత్తుకు కుర్రాళ్లు చిత్తవుతున్నారు .. ఆమె పెదాలతో పొత్తుకు పోరాడుతున్నారు.

ప్రగ్యా జైస్వాల్ పోజు చూసిన వాళ్లంతా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వాటిలో కొంటెవి .. చిలిపివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. పసుపు – గంధం కలిపి చేసినట్టుగా, తేనె కలిపిన వాన కురిసినట్టుగా ఆమె నడుము అందం కనిపిస్తుంటే ఇలాంటి కామెంట్లు పడుతూనే ఉంటాయి. ఆమె అందానికి దక్కిన అభినందనలుగా మారిపోతూనే ఉంటాయి. ఏదేమైనా హాట్ లుక్ తో కూడిన ఫోజులతో ప్రగ్యా అవకాశాలను .. అభిమానులను పెంచుకుంటూ వెళుతుండటం విశేషంగానే చెప్పుకోవాలి.
Must Read ;- మాస్ స్టెప్పులతో బాలయ్య.. ఇంతకీ ఎవరితో? ఎక్కడ?











