హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాలతో తన కెరీర్ ను బిల్డ్ చేసుకున్న .. బ్యూటీ రాధికా అప్టే. వర్మ ‘రక్తచరిత్ర’ సిరీస్ తో ఆమెది ఎలాంటి టాలెంట్ అన్న విషయం అర్ధమైంది జనానికి. ఇటు అందంతో మెస్మరైజ్ చేయగలదు, అటు అభినయంతో మెప్పించగలదు. అయితే ఈ రెండింట్లోనూ ఆమె ఎంపిక చేసుకున్నది మాత్రం గ్లామరస్ రోల్స్ నే. బోల్డ్ నెస్ ను, హాట్ నెస్ ను రంగరించడంలో ఆమెది అందెవేసిన చేయి.

బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీ లోనూ, నెట్ ఫ్లిక్స్ లో ‘లస్ట్ స్టోరీస్’, అంధాధున్ లో సోఫీగా , బజార్ లో ప్రియా గా మెప్పించిన ఆమె అదే చేత్తో ‘రాత్ అకేలీ హై’ అనే థ్రిల్లర్ మూవీతోనూ మెప్పించింది. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తనేంటో నిరూపించుకున్న అమ్మడు.. లేటెస్ట్ గా ‘మిసెస్ అండర్’ కవర్ అనే యాక్షన్ మూవీలోనూ నటిస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఆమె కెరీర్ సంగతి అటుంచితే.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోస్ షేర్ చేసి నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేయడం ఆమె దినచర్యల్లో ఒకటి.

లేటెస్ట్ గా ప్రఖ్యాత మ్యాగజైన్ గ్రాజియా ఇండియా.. కవర్ పేజ్ పై రాధికా అప్టే ఎక్స్ ట్రీమ్ లీ హాట్ అనిపించేలా మెరిసింది. ఆ మ్యాగజైన్ ముఖచిత్రం పై నియాన్ గ్రీన్ బికినీతో షాకిచ్చింది. పింక్ టై డై షర్ట్ లో చాలా హాట్ గా పోజిచ్చిన రాధిక .. చూపరుల మతులు పోగొడుతోంది. గతంలో ఇలాంటి మ్యాగజైన్ కవర్ పేజ్ లపై చాలా సార్లు హాట్ గా మెరిసినా.. ఈ సారి సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా రివీలైంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- లేటు వయసులో హాటు వేషాలేస్తోన్న చిరుతపిల్ల










