దేనికైనా టైమ్ రావాలనే మాటను మనం తరచూ అంటూ ఉంటాము .. వింటూ ఉంటాము. టైమ్ వచ్చినప్పుడే ఫలితం లభిస్తుంది .. ప్రయోజనం చేకూరుతుంది. విత్తనం మొలకెత్తడానికి .. పూలు వికసించడానికి ఇలా ప్రకృతి ప్రతిదానికి ఒక టైమ్ ను ఫిక్స్ చేసింది. దానిని కాదని చెప్పేసి పువ్వును వికసింపజేయడానికి ప్రయత్నిస్తే అది రాలిపోతుందేగానీ వికసించదు. అందువల్లనే సరైన సమయం కోసం వేచి ఉండాలి .. అలా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి .. సత్తాను చూపాలి అంటోంది అందాల రాశి ఖన్నా.
దేనికైనా టైమ్ రావాలని రాశి ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన ఇంతకాలానికి ఎందుకు చెబుతుందంటే, ఆమెకి టైమ్ కలిసొచ్చిన విషయాన్ని చెప్పకనే చెబుతోందని అనుకోవాలి. టైమ్ వచ్చినప్పుడే సత్తా చూపాలని ఆమె అనడంలో అర్థం అదే. నా టైమ్ వచ్చిది .. ఇక చూస్కోండి .. చెలరేగిపోతానని ఆమె భావం. అంతేకాదు .. ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలని అంటోంది. ఆత్మవిశ్వాసమే అసలైన అందం అనే ఆలోచనతో ఆమె ఇలా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంది. ఆత్మవిశ్వాసాన్ని ఆవిష్కరించే పోజుతో కూడిన ఫొటోనే షేర్ చేసింది.
అందం .. ఐస్ క్రీమ్ ఒక లాంటివే .. చూసుకుని మురిసేలోపు కరిగిపోతాయి. ఈ విషయం రాశి ఖన్నా గ్రహించేలోగా కాస్త ఆలస్యమే అయింది. ఇప్పుడు ఆమె తేరుకుని స్పీడ్ చూపిస్తూ టైమ్ వచ్చిందని అనుకుంటోంది. పోనీలెండి ఇకనైనా ఈ దూకుడు ఆమె కంటిన్యూ చేస్తే మంచిదే. తెలుగు ప్రాజెక్టులకు సంబంధించి ఆమె పేరు పెద్దగా వినపడకపోయినా, తమిళంలో మాత్రం మంచిజోరు మీదే ఉంది. విజయ్ సేతుపతి .. ఆర్య .. జీవా వంటి హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు హిట్ కొడితే కొంతకాలం పాటు అక్కడ రాశి ఖన్నా హవా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Must Read ;- ‘అంధాధూన్’ రీమేక్ లో రాశీఖన్నా!