ఈ జెనరేషన్ కుర్రకారు ఇష్టపడని పేరేదైనా ఉంటే.. అది రష్మీ గౌతమ్. ఇటు హాట్ నెస్ ను, అటు బోల్డ్ నెస్ ను సమపాళ్లల్లో రంగరించి.. బుల్లితెర, వెండితెరమీద నిర్మొహమాటంగా కుమ్మరించగల ముద్దుగుమ్మ ఆమె. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ.. సెన్సువల్ ఎక్స్ ప్రెషన్స్ తో కవ్వించే ఆమె.. జబర్దస్త్ లాంటి కామెడీ షోకి అలంకారంగా మారింది.
అలాగే.. అటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటూ తన కెరీర్ ను లీడ్ చేస్తోంది రష్మి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే లాక్ అయిపోయిన అమ్మడు.. ఈ సమయాన్ని సోషల్ మీడియాకి కేటాయించింది. తన హాట్ పోజులతో నెటిజెన్స్ ను కనికట్టు చేస్తోంది. అయితే ఇంతటి సిట్యుయేషన్స్ లో కూడా .. ఆమె అవకాశాల పరంగా జాక్ పాట్ కొట్టడం విశేషంగా మారింది. అదేనండీ.. రష్మీ గౌతమ్ కింగ్ నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన రా అధికారిగా నటిస్తున్నట్టు, అలాగే.. కాజల్ కూడా రా ఏజెంట్ పాత్ర చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ సినిమాలోనే రష్మి గౌతమికి ఓ కీలకమైన పాత్ర ఇచ్చాడట దర్శకుడు ప్రవీణ్. ఇంతకు రష్మీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ రిలేషన్స్ తోనే .. నాగ్ సినిమాలో రష్మీకి మంచి పాత్ర ఆఫర్ చేశాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక నాగార్జున నిర్మించిన యువ సీరియల్ లో కూడా రష్మీ నటించింది. ఆ యాంగిల్ లో కూడా రష్మీకి నాగ్ అవకాశమిచ్చారనుకోవచ్చు. మరి ఈ సినిమాతోనైనా రష్మి కెరీర్ మంచి మలుపు తిరుగుతుందని ఆశిద్దాం.
Must Read ;- యన్టీఆర్ 30 లో హీరోయిన్ గా వసుమతి?