యాక్షన్ హీరో గోపీచంద్.. యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతితో సినిమా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి పక్కా కమర్షియల్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసారు. అయితే.. సంక్రాంతి రోజున ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

అయితే.. ఈ సినిమాలో హీరో గా గోపీచంద్ కన్ ఫర్మ్ కానీ.. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఫిదా బ్యూటీ సాయిపల్లవి పేరు మాత్రం వినిపిస్తోంది. ప్రస్తుతం సాయిపల్లవి నాగచైతన్యతో లవ్ స్టోరీ మూవీ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
లవ్ స్టోరీతో పాటు దగ్గుబాటి రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో కూడా నటించనున్నట్టు తెలిసింది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు కూడా ఒప్పుకుందట. ఇప్పుడు గోపీచంద్ సినిమా కోసం ఆమెను కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది. ఆమె ఈ సినిమాలో నటిస్తే.. ఈ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. ఈ ఫిదా బ్యూటీ గోపీచంద్ సినిమాలో నటించేందుకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.
Must Read ;- సాయిపల్లవి అంత పారితోషికం డిమాండ్ చేసిందా?











