శృంగారతార షకీలా .. పరిచయమే అవసరం లేని పేరు. అప్పట్లో శృంగార రసానికి ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో ఆమెనే నాయిక. అందువలన యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉండేది. షకీలా సినిమాలకి వివిధ భాషల్లో మంచి మార్కెట్ ఉండేది … అందుకే ఆమెకి ఎంతో డిమాండ్ ఉండేది. ఒక వర్గం ప్రేక్షకులు ఆమె సినిమాల కోసం కాచుకుని కూర్చునేవారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా కుర్రకారును మత్తెక్కించిన షకీలా, తాజాగా ‘ఆలీతో సరదాగా‘ వేదిక ద్వారా తన గురించిన విశేషాలను పంచుకున్నారు.
నాకు 22 ఏళ్ల వయసులోనే మలయాళం సినిమాలో చేసే అవకాశం వచ్చింది. నాకు మలయాళం రాకపోవడం వలన ఆ సినిమా దర్శకుడు నన్ను బాగా తిట్టేవాడు. దాంతో ఆ తరువాత నుంచి మలయాళ సినిమాలు చేయకూడదని అనుకున్నాను. కానీ మా ఫాదర్ చనిపోవడంతో, మా కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ విషయంలో మా మదర్ టెన్షన్ పడుతూ ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో మలయాళ సినిమాలు చేయడానికి అంగీకరించాను. ఆ తరువాత తమిళ .. తెలుగు .. కన్నడ సినిమాలు కూడా చేస్తూ వెళ్లాను.
ఇక అనూరాధ .. సిల్క్ స్మిత మంచి స్నేహితులు. అందువలన అనూరాధ దగ్గర నేను సిల్క్ స్మిత పేరును ప్రస్తావించను. నిజం చెప్పాలంటే నాకు సిల్క్ స్మిత అంటే ఇష్టం ఉండదు .. ఎందుకంటే ఒక షూటింగు సమయంలో ఆమె నన్ను చెంపదెబ్బ కొట్టింది. సిల్క్ స్మిత నాకంటే సీనియర్ గనుక గౌరవిస్తాను .. ఆమె సినిమా ద్వారానే నేను పరిచయమయ్యాను గనుక నాకు ఆ కృతజ్ఞత ఉంది.
Must Read ;- సింగిల్ డైలాగ్ చెప్పలేకపోయిన ఆమె.. 700 సినిమాలు చేసిందట!
కానీ సిల్క్ స్మిత అలా చేసిన దగ్గర నుంచి ఆమె అంటే ఇష్టం పోయింది. ‘డర్టీ పిక్చర్‘లోను .. నా బయోపిక్ లోను నేను సిల్క్ స్మితకు పోటీగా వచ్చినట్టు చూపించారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు” అని చెప్పుకొచ్చారు.
Also Read ;- జీవితంలో ఇదే ఆల్ జీబ్రా.. సెక్స్ లేకుంటే ‘గుండె’ గాభరా