తమిళ హీరో ధనుష్ సరసన ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో నటించిన సురభి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ భామ ‘శశి’ అనే సినిమాలో నటించింది. గ్లామర్ పాత్రలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధమేనంటోంది. ఇంతకుముందు జెంటిల్‌మెన్, ఒక్కక్షణం, ఓటర్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆది సాయికుమార్ సరసన నటించింది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఏమంటోందో చూద్దాం.
* నిర్మాతలు ఫోన్ చేసి డైరెక్టర్‌తో మూడున్నర గంటలు కథ చెప్పించారు. ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. ఎమోషన్స్, ఇంటెన్సిటీ ఉంటుంది. ఒకవిధంగా రగ్‌డ్ లవ్‌స్టొరీ. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర ధరించాను. రాజీవ్ కనకాల నా తండ్రిగా నటించారు.
* కాలేజ్‌లో నా బ్యాచ్‌తో కలిసి చేసే అల్లరి సన్నివేశాలు ఫన్నీ గా ఉంటాయి. నాది డామినేటింగ్ పర్సనాలిటీ. నా పాత్రలో మరో షేడ్ కూడా ఉంటుంది. అదేంటన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా అని చెప్పాలి. నాతోపాటు తి పాత్రకు ఇందులో ఇంపార్టెన్స్ ఉంటుంది.
* ఆది పాత్ర విషయానికి వస్తే అతనికి మ్యూజికల్ బ్యాండ్ ఉంటుంది. అతను గిటార్ ప్లే చేస్తాడు. మంచి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే నా పాత్ర వెనక ఓ కథ కూడా ఉంటుంది. అది ఈ సినిమాలో ఆసక్తికరం.
* ఆదితో మొదటిసారి పనిచేస్తున్నా. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. మంచి నటుల ఫ్యామిలీ నుంచి వచ్చానన్న ఫీలింగ్ ఉండదు.
* ఇందులో వెన్నెల కిషోర్, వైవా హర్ష పాత్రలు బాగా నవ్విస్తాయి. ఇప్పటివరకూ మొత్తం 13 సినిమాలు చేశాను. తమిళంలో ఎక్కువ సినిమాలు చేశాను. కన్నడలో డెబ్యూ మూవీ సకత్ చేస్తున్నా. తెలుగులో మరో రెండు కథలు విన్నా. త్వరలోనే ఆ వివరాలు చెబుతాను.
* గ్లామరస్ పాత్రలు చేయడానికి వెనకంజ వేయను. మైథాలాజికల్ సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. వెబ్ సిరీస్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నా వాటిలో కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి. వెబ్ సిరీస్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవు.
Must Read ;- గ్లామర్ కట్టలు తెచ్చుకోవడమంటే ఇదేనేమో!