‘RX 100’ సినిమాతో టాలీవుడ్ లో సంచలనం రేపాడు దర్శకుడు అజయ్ భూపతి. ఒక రియల్ స్టోరీని తీసుకొని మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలచడంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇందులోని పాటలు కుర్రకారును బాగా ఆకట్టుకున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రోల్ గురించి చెప్పుకోవాలి. ఆమెను నెగిటివ్ షేడ్ లో చూపించి పెద్ద షాకే ఇచ్చాడు దర్శకుడు అజయ్.
‘RX 100’ చిత్రానికి ఈ ట్విస్టే ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే మహాసముద్రం మూవీకి కూడా అదే ఫార్ములాను కొనసాగించ బోతున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈయన ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా ఎంతో మంది పేర్లు వినిపించినా చివరకు అదితి రావు ఖరారైంది. మరో హీరో సిద్దార్థ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ‘మహాసముద్రం’లో అదితి రావు ఒక నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదితి రావు నెగిటివ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అదితి రావును నెగిటివ్ షెడ్ లో చూపించనుండడం సాహసమనే చెప్పాలి. ‘మహాసముద్రం’ సినిమా కథ మొత్తం హీరోయిన్ మహా చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే ఈ సినిమా కథ మొత్తం విశాఖ తీరంలోనే సాగుతుంది కాబట్టి దీనికి ‘మహాసముద్రం’ అనే టైటిల్ ఖాయం చేశారని అంటున్నారు . ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి మరో హిట్ కొట్టడం ఖాయంగా కనబడుతుంది. మరి అదితీరావు నెగెటివ్ రోల్ ‘మహాసముద్రం’ చిత్రానికి ఏ మేరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.











