చందమామ కాజల్ అగర్వాల్ తర్వాత.. కీర్తి సురేషే అంటున్నారు. ఇంతకీ.. విషయం ఏంటంటే.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి అనతి కాలంలోనే తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టింది. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కీర్తి సురేష్ మహానటి సినిమాలో అలనాటి నటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని చెప్పచ్చు. ఈ సినిమాలో కథానాయికగా, జెమిని గణేష్ కి భార్యగా, పిల్లలకు ఓ తల్లిగా.. ఆ పాత్రలో లీనమై నటించింది.
ఆమె నటించింది అనడం కంటే జీవించింది అనడం కరెక్ట్ అని చెప్పచ్చు. అందుకనే.. జాతీయ అవార్డ్ సైతం దక్కించుకుంది. మహానటి సినిమాతో ఆమె స్టార్ డమ్ మరింత పెరిగింది. బాలీవుడ్ లో సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటే..ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇలా.. కీర్తి సురేష్ కి క్రేజ్ రావడంతో అభిమానులు కీర్తి పేరుతో ఫ్యాన్ పేజీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే.. ఆమె నటనకు మాత్రమే అభిమానులు ఉన్నారనుకుంటే పొరపాటే. ఆమె ఫ్యాషన్స్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
కీర్తి ఫ్యాషన్స్ పేరుతో ఫేస్ బుక్ పేజీలు స్టార్ట్ చేసారంటే.. కీర్తిని ఎంతగా ఫాలో అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కీర్తి సురేష్ బూడిద రంగు డ్రెస్ తో నడుమ బెల్ట్ తో బ్లాక్ బూట్లతో సాడిల్ బ్యాగ్ తో దర్శనమిచ్చింది. ఈ సాడిల్ బ్యాగ్ ధర 2.5 లక్షలు అని సమాచారం. ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చు కంటే సాడిల్ బ్యాగ్ థర చాలా ఎక్కువ. గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే చాలా కాస్ట్ లీ బ్యాగులు వాడేది. ఇప్పుడు కాజల్ తర్వాత కీర్తి సురేష్ ఇంత కాస్ట్ లీ బ్యాగ్ వాడుతుండడం విశేషం.
Must Read ;- టెన్షన్ లో మహానటి.. ఇంతకీ ఏమైంది.?