రామ్ చరణ్… ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కోవిడ్ కారణంగా నిలిచిపోయింది. ఆఫ్టర్ లాక్ డౌన్.. ఈ చిత్ర షూటింగ్ తిరిగి ఊపందుకుంది. దీని తర్వాత చరణ్.. కొరత శివ ‘ఆచార్య’ సినిమాలో నటిస్తాడు. అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక సన్నివేశాలలో చరణ్ నటిస్తాడు.
ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ .. మోహన్ రాజా డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పాడని సమాచారం. అసలు చరణ్ ‘ధ్రువ’ సినిమాను మోహన్ రాజా డైరెక్షన్ లో చేయాలి. ఎందుకంటె ‘ధ్రువ’ సినిమాకు మాతృక ‘తనీ ఒరువన్’ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కించింది మోహన్ రాజానే. కానీ ఎందుకనే అప్పుడు వర్కవుట్ కాలేదు.
చరణ్ కూడా ‘ధ్రువ’ సినిమాకు సంబంధించి డైరెక్టర్ గా సురేంద్ర రెడ్డికే ఓటు వేసాడు. ఇప్పుడు చరణ్-మోహన్ రాజా కాంబినేషన్ లో సినిమా రానుందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినపడుతుంది. వీరి కలయికలో సినిమా అంటే భారీ అంచనాలు ఉండడం సహజం. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.