టాలెంటెడ్ తమిళ హీరో సూర్య.. తాజా సినిమా ‘సూరారై పోట్రు’. ‘గురు’ ఫేమ్ సుధకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళి కథానాయికగా నటించిన ఈ మూవీ ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో మోహన్ బాబు ఓ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
2డి ఎంటర్ టైన్ మెంట్, సిఖ్యా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. దీన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన మరో మేకింగ్ వీడియో ను విడుదల చేశారు నిర్మాతలు . సినిమా షూటింగ్ బిగిన్ అయిన కొద్ది రోజులకు విడుదల చేసిన వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు ఈ వీడియో ను సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఆ వీడియోలో దర్శకురాలు సుధ కొంగరా మాట్లాడుతూ.. ‘పదేళ్ల క్రితం కెప్టెన్ గోపీనాథ్ ఇంటర్వ్యూ చూశాను. సిప్లీ ఫ్లై బుక్ చదివి ఆశ్చర్యపోయాను. దాని నుండే ఒక కథను రాసుకున్నాను. సూర్య గారిని కలిసిన సమయంలో కథ ఉంది మీకు సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఇది ఒకసారి చదవండి అంటూ 40 పేజీల కథను ఇవ్వడం జరిగింది. సూర్య గారు కథకు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఒక మనిషి జీవితంలో ఇన్ని ఎత్తు పల్లాలు ఉండటం అంటే నిజంగా అద్బుతం. ఖచ్చితంగా ఈ సినిమా చేద్దాం అన్నారు. అలా సినిమా ప్రారంభం అయ్యింది. షూటింగ్ నుండి డబ్బింగ్ వరకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాము అంటూ యూనిట్ సభ్యులు వీడియోలో పేర్కొన్నారు.
మేకింగ్ వీడియో వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=mKHHe0Bu4cU&feature=emb_logo