నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అఖండ’ మూవీ నిడివి 2 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. ఈ సినిమాకు నిన్ననే సెన్సార్ పూర్తయ్యింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్ విలన్లుగా నటించారు. ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కాబోతోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా కావడమే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విడుదలయ్యాయి. ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది. పక్కా మాస్ అప్పీల్ తో డైలాగులు ఉన్నాయి. ఏయ్, అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా ? పట్టిసీమ తుమా ? పిల్ల కాలువ.. కొడకా, ఒక సారి నేను డిసైడ్ అయి బరిలోకి దూరితే.. ఇక బ్రేకులు లేని బుల్డోజర్ నే.. తొక్కి పారదొబ్బుతా, ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం లాంటి డైలాగులు డైనమైట్లలా పేలాయి.
లెష్టా రైటా టాపా బాటమా ఎటు నుండి ఎక్కుపెట్టి గోకినా కొడకా ఇంచ్ బాడీ దొరకదు, మీకు సమస్య వస్తే దండం పెడతారు.. మేము ఆ సమస్యకే పిండం పెడతాం.. బోత్ ఆర్ నాట్ సేమ్..!, కాలు దువ్వే పంది ముందు రంగు మార్చిన పంది.. కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. లాంటి డైలాగులు ఇప్పటికే జనంలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో లైక్ లు, వ్యూస్ పరంగానూ కొత్త రికార్డులను ఇది క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చినట్లు తెలిసింది. సినిమా మీద సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది.
Must Read ;- ‘అఖండ’ ఓ రేంజ్ లో దుమ్ము దులిపేస్తున్నాడు











