బోయనపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనికా రెడ్డి ఈ రోజు ఆళ్లగడ్డలో టీడీపీ నియోజకవర్గ నాయకులు ,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అఖిల ప్రియ అరెస్టు వెనుక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది అక్కను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డీజీపీని కలిసి అక్క అఖిల ప్రియను అరెస్టు చేసిన తీరును వివరిస్తానని చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా , ఏ సమయంలో అయినా తనకు ఫోన్ చేయవచ్చని అన్నారు. అక్కలాగే తాను అందరికీ అండగా ఉంటానని ఆమె ధైర్యం చెప్పారు.
Must Read ;- అఖిలప్రియకు 3 రోజుల పోలీసు కస్టడీ