అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే… ఈ సినిమా తర్వాత అఖిల్.. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మూవీ చేయనున్నారు. ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఇటీవల ఈ భారీ చిత్రాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అప్డేట్ రివీలైంది. అది ఏంటంటే.. అఖిల్ సోషల్ మీడియాలో గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను షేర్ చేసారు. ఈ వీడియోకు మార్నింగ్ రష్.. రోజును ప్రారంభించడానికి ఇంత కంటే మంచి మార్గం ఏముంటుంది అంటూ క్యాప్షన్ పెట్టాడు. హార్స్ రైడింగ్ చేస్తున్న అఖిల్ వీడియోను చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అఖిల్ కి స్వయంగా గిజెల్ అనే గుర్రం ఉంది. టైమ్ కుదిరినప్పుడల్లా… అఖిల్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.
అఖిల్ ఇలా హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో… సురేందర్ రెడ్డి సినిమాలో గుర్రపు స్వారీకి సంబంధించిన సీన్స్ ఉన్నాయి. అందుకనే అఖిల్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే… ఇది అభిమానులు అనుకుంటున్నట్టుగా సురేందర్ రెడ్డితో చేయనున్న సినిమా కోసమా..? లేక తన హార్స్ రైడింగ్ తన హాబీ కాబట్టి చేస్తున్నాడా..? అనేది అఖిలే చెప్పాలి. ఈ మూవీని జనవరిలో గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది ఎంపిక చేయనున్నారు. అఖిల్ గత చిత్రాలు ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. దీంతో అఖిల్ తో పాటు అక్కినేని వంశాభిమానులు సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, సురేందర్ రెడ్డితో చేయనున్న సినిమాలతో సక్సస్ సాధించి సక్సస్ ట్రాక్ లోకి వస్తాడని ఆశిద్దాం.











