టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సీనియర్ హీరోల్లో 50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ హీరోగా నాగార్జునకి ఓ రికార్డ్ ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో ఈ మూవీకి ప్రీక్వెల్ చేయాలి అనుకున్నారు. అదే ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ స్ర్కిప్ట్ రెడీ చేసాడు. కథ నాగార్జునకి వినిపిస్తే.. చాలా మార్పులు చెప్పారు. ఆతర్వాత కళ్యాణ్ కృష్ణ, సీనియర్ రైటర్ సత్యానందంతో కలిసి కథ పై మళ్లీ వర్క్ చేశారు.

మళ్లీ నాగార్జునకి కథ వినిపించడం.. నాగార్జున సంతృప్తి చెందడంతో ‘బంగార్రాజు’ సెట్స్ పైకి రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు. తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమాని జనవరి 16న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మించనున్నారు. అనూబ్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటలను రికార్డ్ చేసారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో పాటలన్నీ హిట్ అయ్యాయి.
అలాగే ఈ సినిమాలో పాటలు కూడా హిట్ అయ్యేలా క్యాచీ ట్యూన్స్ రెడీ చేశారని తెలిసింది. ఇందులో నాగార్జునతో కలిసి నాగచైతన్య నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అలాగే అఖిల్ కూడా నటించనున్నట్టు ప్రచారం జరిగింది. నిజంగానే నాగచైతన్య, అఖిల్ ఇందులో నటించనున్నారా..? లేదా..? అనేది తెలియాల్సివుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాని కంప్లీట్ చేయాలని పక్కా ప్లాన్ రెడీ చేశారట. మరి.. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
Must Read ;- మహిళలను కించపరచడమే.. హీరో నాగార్జునపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు











