అగ్గిపుల్ల లాంటి పిల్ల అలియా భట్. భారీ అందాల సుందరి కాకపోయినా, ఐస్ క్రీమ్ పై చెర్రీ పండులా ఊరిస్తూ ఉంటుంది. అలియా హైట్ విషయంలో పొదుపు సూత్రం పాటించిన దేవుడు, ఉన్నంతలోనే ఆమెకి అన్ని అందాలను సమకూర్చాడు. ఈ మాత్రం అందాలు చాలు .. కుర్రాళ్ల గుండె గనులను క్వారీలుగా కొల్లగొట్టడానికి అనుకుంటూ ఆమె రంగంలోకి దిగింది. అప్పటి నుంచి హాట్ హాట్ గా తన దూకుడు చూపిస్తూనే వెళుతోంది .. యూత్ ను తన చుట్టూ తిప్పుకుంటూనే ఉంది.అలియా నుంచి ఒక సినిమా రానుందంటే, పండుగ వస్తున్నట్టుగానే కుర్రాళ్లు ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటారు.

అలాంటి అలియా తాజా చిత్రంగా ‘గంగూబాయి కథియవాడి’ సినిమా రూపొందుతోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ .. కథ అంతా కూడా అలియా చుట్టూనే తిరుగుతుంది. ముంబై – కామాటీపుర వేశ్య వాటిక నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. లాక్ డౌన్ కి ముందే మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. మళ్లీ ఇటీవలే మొదలైన షూటింగ్ జోరుగా జరుగుతూ వచ్చింది. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా టాకీ పార్టు పూర్తిచేసుకుంది. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి ఉంది.
ఈ రెండు పాటలను కూడా అలియాపై ఈ నెల 3 వారంలో చిత్రీకరించనున్నారు. ఈ రెండింటిలో చాలా గ్రాండ్ గా .. 200 మంది డాన్సర్లతో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అలియా ఆ పాటకి సంబంధించిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. రెండు వారాల పాటు ఆమె రిహార్సల్స్ చేసిన తరువాత, షూట్ కి వెళ్లనున్నారు. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో కామాటీపుర నేపథ్యంతో కూడిన ఒక భారీ సెట్ లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర నటిగా తనకి మరింత మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకాన్ని అలియా భట్ వ్యక్తం చేస్తోంది. అజయ్ దేవగణ్ .. ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనుండగా, ఐటమ్ నెంబర్ తో హుమా ఖురేషి దుమ్మురేపనుందని అంటున్నారు.
Must Read ;- సయీఫ్ అలీఖాన్ పై శివ ‘తాండవమే’










