యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది.
ఈనెల 7న పూజా కార్యక్రమాలతో ఈ భారీ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరసన నటించే అందాల తార ఎవరనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ క్రేజీ మూవీలో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆలియాభట్ తెలిపారు.
గురువారం ముంబైలో గంగూభాయ్ కతియావాడి ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో తారక్ సరసన ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రమిది. సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఆలియా భట్ టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ సరసన నటిస్తే… ఇప్పుడు కొరటాలతో చేస్తున్న మూవీలో ఎన్టీఆర్ సరసన నటిస్తుండడం విశేషం.