పనిలో పనిగా హైదరాబాద్ లోని తన స్నేహితురాలు అయిన మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ను కలిసి కొంతసేపు ముచ్చటించింది. అంతేకాదు మహేష్, నమ్రతల కుమార్తె సితార ఘట్టమనేని కోసం ఓ మంచి బహుమతిని కూడా అలియా పట్టుకొచ్చింది. సాధారణంగా పెద్దలే కాదు పిల్లలు ఎంతగానో ఇష్టపడేవి డ్రెస్సులు. అలియా కూడా సితార కోసం
ఎడమామా’ అనే బ్రాండ్ డ్రెస్సులు తీసుకుని వచ్చింది. ఈ బ్రాండ్ ను సెలబ్రిటీలు బాగా ఇష్టపడుతుంటారు. అప్పటికప్పుడే ఆ డ్రెస్సులను ధరించి సితార మురిసిపోతూ డాన్స్ చేసింది.. అది చూసి సంతోషించడం అలియాభట్ వంతయ్యింది. ఈ సందర్భంగా అలియాభట్ కు సితార, నమ్రతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
‘ఆర్ ఆర్ ఆర్’ కాకుండా మరోవైపు బాలీవుడ్లో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రంలోను, సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘గంగూబాయి కతియావాడి’, ఇంకా కరణ్ జోహార్ తీస్తున్న ‘తఖ్త్’ చిత్రంలోను అలియా నటిస్తూ బిజీగా ఉంది.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ సెట్ లో బాలీవుడ్ బ్యూటీ.. !











