పెళ్లంటే పందిళ్లు .. సందళ్లు .. తప్పెట్లు .. తాళాలు .. తలంబ్రాలూ .. మూడేముళ్లు .. ఏడే అడుగులు .. మొత్తం కలిసి నూరేళ్లు అంటూ పెళ్లికి ఆచార్య ఆత్రేయ ఇచ్చిన నిర్వచనం, ఏ పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టినా గుర్తొస్తుంది. ఇప్పుడు అలాంటి పెళ్లి సందడి మెగా ఫ్యామిలీలో మొదలైంది. చిరంజీవి సోదరుడైన నాగబాబు కూతురు ‘నిహారిక’ రేపు రాత్రి పెళ్లి పీటలు ఎక్కనుంది. తెలుగు చిత్రపరిశ్రమలో మెగా ఫ్యామిలీకి గల క్రేజ్ వేరు. ఆ కుటుంబానికి సంబంధించిన ఏ వేడుకైనా అది తమ ఇంట్లోనే జరుగుతుందన్నట్టుగా అభిమానులు భావిస్తుంటారు. అంతా కూడా ఆ వేడుకను తిలకించడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు.

అందరూ నిహారిక వివాహ వేడుక వైపు దృష్టి పెట్టడానికి కారణం, ఆమె మెగా డాటర్ అని మాత్రమే కాదు, తనకంటూ ఉన్న ఫాలోయింగ్ కూడా ఒక కారణమే. ఇతర కథానాయికల పరిస్థితి వేరు .. నిహారిక వచ్చిన నేపథ్యం వేరు. అందువలన ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, ఆ ఫ్యామిలీ పట్ల అభిమానులకు గల గౌరవ మర్యాదలను కాపాడుతూ నెగ్గుకురావడం నిహారిక ప్రత్యేకత. ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిహారిక దక్కించుకుంది. తొలినాళ్లలోనే వెబ్ సిరీస్ లపై కూడా తనదైన మార్క్ చూపించింది. అందమైన అల్లరి చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యూత్ కి మరింత చేరువైంది. అలా నిహారిక తెచ్చుకున్న క్రేజ్ కూడా ఆమె వివాహ మహోత్సవంపై అంతా ఆసక్తిని చూపడానికి కారణమైంది.

నిహారిక నేపథ్యం విషయానికొస్తే ఆమె మామూలు అదృష్టవంతురాలు కాదనే విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన ఒక మహా కథానాయకుడు తనకి పెదనాన్న కావడం .. యూత్ ఒక మంత్రంలా జపించే పవన్ కల్యాణ్ తనకి బాబాయ్ కావడం .. ఆడపిల్లను అమ్మలా చూసుకునే తండ్రి లభించడం ఆమె అదృష్టం. అంతేకాదు ఈ తరం కుర్రకారును ఉత్సాహ పరుస్తున్న హీరోల్లో చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ తో పాటు ఆ వరుసలో తన అన్నయ్య వరుణ్ తేజ్ ఉండటం మరో విశేషం. ఇంతగా ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న ఒక కుటుంబం నిహారిక వెనుక ఉండటంతో ఆమె వివాహం ఇప్పుడు మరింత ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ సెట్ లో బాలీవుడ్ బ్యూటీ.. !

నిహారిక వివాహం వెంకట చైతన్య జొన్నలగడ్డతో రేపు రాత్రి 7:15 నిమిషాలకి జరగనుంది. రాజస్థాన్ – ఉదయ్ పూర్ లోని ‘ఉదయ్ విలాస్’ ఈ వివాహ వేడుకకు వేదికగా మారింది. మెగా ఫ్యామిలీ స్థాయికి తగినట్టుగా అక్కడ ఏర్పాట్లు జరిగాయి. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైనవారు, తమ కుటుంబాలతో ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సన్నిహితులతో వ్యాపార .. రాజకీయ .. సినీ వర్గాలకి చెందినవారు ఉన్నారు. ఇటు దక్షిణాది నుంచి .. అటు ఉత్తరాది నుంచి ఏయే సినీ ప్రముఖులు హాజరు కానున్నారనేది అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వేడుకకు విచ్చేసిన వాళ్లందరికీ పట్టువస్త్రాలను బహుమతిగా అందజేస్తున్నారట.
విలాసవంతమైన ఆ ప్యాలెస్ లో ఖరీదైన సూట్లలో అతిథులకు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది బంధుమిత్రులు అక్కడికి చేరుకున్నారు. మిగతావారు ఈ సాయంత్రానికి అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. చిరంజీవి .. నాగబాబు బంధుమిత్రులను రిసీవ్ చేసుకుంటూ ఉండగా, మిగతా పనుల్లో చరణ్ .. బన్నీ .. వరుణ్ తేజ్ తదితరులు బిజీగా ఉన్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకను వీక్షించేందుకు .. మనసారా ఆశీస్సులు అందజేసేందుకు .. శుభాకాంక్షలు తెలియజేసేందుకు అభిమానులంతా సిద్ధమైపోతున్నారు.
Must Read ; ఆచార్య క్లైమాక్స్ ను భారీగా డిజైన్ చేసిన కొరటాల
A whistle worthy moment at the #NisChay sangeet 😍 🔥#AlluArjun #Bunny #Tollywood #TollywoodActor #Pushpa #Fashionista #StyleInspo #OOTD #NiharikaKonidela #ChaitanyaJonnalagadda #ChaitanyaJV #MrsNiha #MegaFamily #NagaBabu pic.twitter.com/jT2whAEKjE
— Hyderabad Times (@HydTimes) December 8, 2020











