అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఈ చిత్రానికి గిరి. పి దర్శకత్వం వహించారు. ఈ నెల 23న బంగారు బుల్లోడు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ సినిమా అంటే. ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అలా ఈ మూవీ ట్రైలర్ ఉండడంతో సినిమా సక్సస్ పై నమ్మకంగా ఉన్నారు. అల్లరి నరేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండడంతో పాటు ప్రమోషన్స్ లో స్పీడు పెంచాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘బంగారు బుల్లోడు’ వివాదంలో చిక్కుకున్నాడు. మేటర్ ఏంటంటే.. ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయి అంటూ తెలుగు రాష్ట్రాల్లోని స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ వృత్తిని అవమానించేలా ఈ సినిమాలో సన్నివేశాలను చిత్రీకరించారని మండిపడుతున్నారు. తమ వృత్తిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని స్వర్ణకార సంఘాల ప్రతినిధులు ఫిల్మ్ ఛాంబర్ లో వినతి పత్రాలు అందచేశారు.
ఇంతకీ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సన్నివేశాలు ఏంటంటే.. ఒకరి బంగారు ఆభరణాలను వేరొకరి వేడుకలకి స్వర్ణకారులు ఇచ్చినట్టుగా ట్రైలర్లో చూపించారు కానీ.. స్వర్ణకారులు ఎవరూ అలా చేయరని.. ఈ సన్నివేశాలు స్వర్ణకారులను కించపరిచేవే అని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అన్నారు. ఆ సన్నివేశాలను తొలగించాలని.. అలాగే ఈ మూవీ రిలీజ్ కి ముందు చూపించాలని.. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని అడ్డుకుంటామని చెప్పారు.
Must Read ;- ట్రైలర్ టాక్ : గోల్డ్ లోన్స్ గోల్ మాల్ స్టోరీ ‘బంగారు బుల్లోడు’