ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో .. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ కంటిన్యూ చేయబోతున్నారు. ఈ సినిమా రెండు పార్టులు గా విడుదలవుతుండడంతో.. దానికి తగ్గ ప్రత్యేకతల్ని ఈ సినిమాలో వర్కవుట్ చేయబోతున్నాడు దర్శకుడు సుక్కు. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్ బ్రేక్ లో ఇంటి దగ్గర లాక్ డౌన్ ను తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు.
బన్నీకి చిచ్చరపిడుగుల్లాంటి ఇద్దరు పిల్లలన్న సంగతి తెలిసిందే. బేబీ అర్హ, మాస్టర్ అయాన్ లతో బన్నీ వీలు దొరికినప్పుడల్లా వారి అల్లరి తో పోటీ పడుతూ.. తనూ చిన్నపిల్లవాడైపోతాడు. పిల్లలిద్దరిచేత రకరకాల ఆటలు ఆడిస్తుంటాడు. ఈ క్రమంలో బన్నీ అర్హ, అయాన్ లతో కలిసి ఆరుబైట మంచం మీదకి తన అల్లరిని షిఫ్ట్ చేశాడు.
నులకమంచం మీద పిల్లలిద్దరితోనూ పడుకున్న బన్నీ.. ఇద్దరికీ ఆకాశాన్ని చూపిస్తూ ఏవో కబుర్లు చెబుతూ ఒక వీడియోలో రివీలయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. బన్నీ గుండెల మీద అర్హ పడుకొని ఆకాశాన్ని చూస్తుండగా.. ఆమె అన్నయ్య .. ఆ పక్కనే పడుకొని తానూ ఆకాశాన్ని చూస్తున్నాడు. బన్నీ భార్య స్నేహ ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. సో ఈ విధంగా బన్నీ తన లాక్ డౌన్ టైమ్ ను చక్కగా స్పెండ్ చేస్తున్నాడన్నమాట.
Must Read ;- ‘బాహుబలి, కే.జీ.ఎఫ్’ బాటలో బన్నీ ‘పుష్ప’?