స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప’ . పాన్ ఇండియా కేటగిరిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో సైతం.. ఆగస్ట్ 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. రష్మికా మందన్న హీరోయిన్ గా గిరిజన యువతిగా నటించబోతున్న ఈ సినిమా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది.
నేడు బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘పుష్ప’ సినిమాలోని బన్నీ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సాయంత్రం 8గంటల 19 నిమిషాలకు విడుదలైన బన్నీ పుష్పరాజ్ వీడియో అభిమానులకు గూస్ బంప్ప్ తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ .. అబ్బుర పరుస్తోంది. బన్నీ తన ఫైట్స్ తో పెర్ఫార్మెన్స్ తో తగ్గేదేలే అనిపిస్తున్నాడు. బన్నీ ఇంట్రడక్షన్ మాత్రమే చూపిస్తారనుకున్న అభిమానులకు ఏకంగా టీజర్ తోనే విందు భోజనం పెట్టేశాడు సుకుమార్.
అడవి లో హీరోయిక్ గా .. పరుగుపెడుతున్న పుష్ప రాజ్ జూలు విదిల్చిన సింహంలా తన ఫేస్ ను చూపించడం ఆకట్టుకుంటోంది. ఇందులో బన్నీ అద్భుతమైన మేకోవర్ అభిమానులచేత విజిల్స్ వేయిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక అతడిని ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రను మలయాళ టాలెంటెడ్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలసిందే. మరి ఈ సినిమా బన్నీ, సుకుమార్ కు ఏ రేంజ్ మూవీ కానుందో చూడాలి.
Also Read:అభిమానుల ముందుకు రాబోతున్న‘పుష్ప’రాజ్
#IntroducingPushpaRaj –https://t.co/aDJPtAamH9
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा#ThaggedheLe 🔥🔥🔥@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2021











