కోవిడ్ 19 కారణంగా తరచుగా వాయిదా పడిన సినిమాల లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నది బన్నీ, సుక్కుల ‘పుష్ప’నే. అలవైకుంఠపురములో మూవీతో బన్నీ, ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన నేపథ్యంలో ఈ కాంబినేషన్ పై హైయస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పుష్ప’ సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది, ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. సినిమా కూడా లాంచ్ అయింది. అయితే మూవీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళాలనుకొన్న సమయంలోనే కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘పుష్ప’ సినిమా షూటింగ్ కు సరైన ముహూర్తమే కుదరలేదు.
ఇప్పటివరకూ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘పుష్ప’ సినిమా షూటింగ్ కు ఎట్టకేలకు సమయం ఆసన్నమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ మొదటి వారం నుంచి బన్నీ, సుక్కు బృందం ‘పుష్ప’ షూట్ ను ప్రారంభించనున్నారని సమాచారం. నవంబర్ 6 నుంచి వైజాగ్ లో ప్రారంభించి కంటిన్యూ షెడ్యూల్ చేస్తారట. ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ మాస్ ఫీస్ట్ అందించబోతున్నాడట. రష్మికా మందణ్న పోషించనున్న విలేజ్ గాళ్ పాత్ర కూడా సినిమాకి హైలైట్ కానుందట. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని చెబుతున్నారు. దాదాపు పదేళ్ళ తర్వాత రానున్న బన్నీ సుక్కూ కాంబో మూవీపై అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. మరి పుష్ప సినిమాతో బన్నీకి సుక్కు ఏ రేంజ్ హిట్టిస్తాడో చూడాలి.











