చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న బన్నీటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తెలుగు చరిత్రలోనే తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. మంగళవారం (అక్టోబర్ 17) ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్.
తద్వారా 69 ఏళ్ల ఇండస్ట్రీ చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీంతో ఈ స్టైలిష్ హీరోకు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బన్నీకి కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ వెంట అతని సతీమణి స్నేహలతా రెడ్డి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ముతో పాటు పలువురు కేంద్రమంత్రలు పాల్గొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప కు గానూ ఈ అవార్డు అందుకున్నారు బన్నీ.