ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో సైతం విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన పుష్ప టీజర్ రికార్డు వ్యూస్ తెచ్చుకుంది. ఆగష్ట్ 13న విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ను సుక్కు చాలా స్పీడ్ గా చిత్రీకరిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలోని విలన్ పాత్ర ధారి ఫహద్ ఫాజిల్ కూడా జాయిన్ అయ్యాడు. బన్నీ , ఫహద్ మీద కొన్ని ఆసక్తికరమైన సీన్స్ ఈ షెడ్యూల్ లోనే ఉన్నాయి.
ఇటీవల బన్నీకి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను కొనసాగించింది చిత్ర బృందం. అయితే రోజు రోజుకీ కేసులుండడంతో .. ఫహద్ ఫాజిల్ మాత్రం కొచ్చీ వెళ్ళిపోయాడని.. దాంతో సుకుమార్ ‘పుష్ప’ షూటింగ్ ను తాత్కాలికంగా ఆపివేశాడని తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడ్డాకా మళ్ళీ ఫహద్ నుంచి ప్రెష్ డేట్స్ తీసుకొని ఆయన మీద తీయాల్సిన సీన్స్ ను చిత్రీకరిస్తారట.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో బన్నీ పుస్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే.. ఇందులో గిరిజన యువతిగా పుష్పరాజ్ అంటే పడిచచ్చిపోయే పాత్రలో రష్మికా మందన్న నటిస్తోంది.దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ టైమ్ కి కరోనా తగ్గుముఖం పడితే.. సినిమాను అదే డేట్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి పుష్ప షూటింగ్ తిరిగి ఎప్పటికి ప్రారంభమవుతుందో చూడాలి.











