ఈ ఏడాది ‘అలవైకుంఠపురములో’ మూవీ బిగ్గెస్ట్ హిట్టు తో శుభారంభం చేశాడు స్టైలిష్ స్టార్ బన్నీ. ఆ వెంటనే సుక్కుతో ‘పుష్ప’ మూవీ సెట్ చేసుకున్నప్పటికీ .. లాక్ డౌన్ వల్ల దాదాపు ఎనిమిది నెలలు ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళకుండా అయిపోయింది ఆ సినిమా. ఈ నెల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు మేకర్స్. ఇక అసలు విషయానికొస్తే.. బన్నీ త్వరలోనే బిజినెస్ మేన్ గా మారబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే అతడు భారీ ఎత్తున వెబ్ సిరీస్ ప్రొడక్షన్స్ ను స్టార్ట్ చేస్తాడట.
తమ ఓన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ‘ఆహా’ కోసమే బన్నీ ఈ వెబ్ సిరీస్ బిజినెస్ ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. వాటికోసం ఆహా వారు కథల్ని వింటున్నారని, ఆ ప్రాసెస్ లో కొన్ని ఇన్నోవేటివ్ కంటెంట్స్ రెడీ అవుతున్నాయని వినికిడి. ప్రస్తుతం వెబ్ సిరీస్ కు మంచి డిమాండ్ ఉండడం.. దాంతో పాటు ఆహా ఓటీటీకి వెబ్ సిరీస్ కంటెంట్ తక్కువగా ఉండడం దీనికి కారణమని అనుకోవచ్చు. ఏది ఏమైనా బన్నీ.. సినీ నిర్మాణం చేయకపోయినా.. వెబ్ సిరీస్ నిర్మాణం ప్రారంభించనుండడం అభిమానులను ఖుషీ చేస్తోంది. త్వరలోనే అల్లు అర్జున్ వెబ్ సిరీస్ బిజినెస్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇస్తాడని సమాచారం.