స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ పుష్ప చేస్తున్నారు. ఈ సినిమా మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమాని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్నిఆల్రెడీ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది.
బన్నీ పుష్ప. కొరటాల ఆచార్య పూర్తి చేసిన తర్వాత వీరిద్దరూ కలిసి ఈ క్రేజీ మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి బన్నీ కోసం ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేశాడట. బన్నీకి స్టోరీ లైన్ మాత్రమే కాకుండా.. ఫుల్ స్టోరీ కూడా వినిపించాడట. కథ విని బన్నీ చాలా బాగుంది సినిమా చేద్దామని మాట ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ కథను అల్లు అరవింద్ కూడా వినాల్సివుందట.
ఇది ఎమోషనల్ యాక్షన్ మూవీగా ఉంటుందని.. ఇంకా చెప్పాలంటే.. కేజీఎఫ్ లా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుందని తెలిసింది. మహర్షి సినిమా తర్వాత నుంచి వంశీ పైడిపల్లి సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ.. ఏ హీరో కూడా ఓకే చెప్పడం లేదు. మరి.. బన్నీ అయినా వంశీతో మూవీకి ఎస్ అంటారో నో అంటారో చూడాలి.
Must Read ;- మెగా ‘ఆచార్య’కు వార్నర్ బ్రదర్ తోడయ్యాడు