తెలుగు సినిమా రంగంలో హాస్యనట దిగ్గజం అల్లు రామలింగయ్య నాటిన బీజం మామూలిది కాదు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారాయ. ఆయన నాడు నాటి బీజం నేడు వటవృక్షమైంది. అలాంటి అల్లు రామలింగయ్య జయంతి నేడు. ఆయన కుమారుడు అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీషలతో కలిసి తన తండ్రి జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ప్రకటన కూడా చేశారు. అదేంటంటే గండిపేటలకు దగ్గరలో తన తండ్రి అల్లు రామలింగయ్య పేరుతో ఆయన ఓ స్టూడియోను నిర్మించనున్నారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ అల్లు స్టూడియోస్ ఏర్పాటవుతుందన్నమాట. హైదరాబాద్ లోని గండిపేటలకు దగ్గరలో ఈ స్టూడియో నిర్మితమవుతుంది. అల్లు రామలింగయ్య 99వ పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడు ముగ్గురితోనూ కలిసి అల్లు అరవింద్ ఈ స్టూడియోకు సంబంధించిన ప్రకటన చేశారు.
ఇంత చిన్న స్టూడియో ఎందుకు?
అల్లు అరవింద్ చేసినా చక్కటి ప్లానింగ్ తోనే ఉంటుంది. ఆయన చేతిలో ‘ఆహా’ ఓటీటీ ఉంది. వెబ్ సిరీస్, గేమ్ షోలు లాంటివి వాటికి చిన్న స్టూడియో అయితే అనుకూలంగా ఉంటుంది. పైగా దానికి సమీపంలోనే ఉన్న నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడయో త్వరలోనే మూతపడుతుందని అంటున్నారు. స్టూడియో ఆలోచన మెగాస్టార్ చిరంజీవికి ఎప్పట్నుంచో ఉన్నా అమలు చేయడంలో ఆలస్యమైంది.
పైగా ఆయన దృష్టి వైజాగ్ మీద ఉన్నట్టు సమాచారం. దాంతో అల్లు అరవింద్ తన ఆలోచనల స్పీడు పెంచి తన తండ్రి శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ పేరు ప్రకటించారు. ఆ ప్రాంతంలో బోర్డు పెట్టి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుత ఓటీటీ ప్రపంచంలో చిన్న ఫ్లోర్ లతో స్టూడియో నిర్మాణం జరిగితే నిర్మాణం ఖర్చుకూడా బాగా తగ్గుతుందనే ఆలోచన కూడా అరవింద్ వచ్చినట్టుంది.











