యంగ్ హీరో అల్లు శిరీష్ సరికొత్తగా గోలోకల్ బీ వోకల్ అనే ఉద్యమానికి నాంది పలికిన విషయం తెల్సిందే. ‘‘గో లోకల్ బీ వోకల్’’ అనే హ్యాష్ ట్యాగ్ తో శిరీష్ మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఆన్ లైన్ లో విశేషంగా ట్రెండ్ అవుతుంది. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పాయల్ గోష్ సూచన మేరకు ప్రతి భారతీయుడు కుదిరినంత వరకు విదేశి బ్రాండ్ల వాడకాన్ని తగ్గించాలి. మన వద్ద ప్రత్యామ్నాయం లేకపోతేనే అది కూడా స్వదేశ యేతర ఉత్పత్తి వాడాలి. అంతేగాని ప్రతి అవసరానికి విదేశి ఉత్పత్తులు వాడకూడదని శిరీష్ పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం తానే స్వయంగా మార్కెట్ కి వెళ్లి ఏరికోరి భారతీయ బ్రాండ్లను వెతికి మరీ కొన్నారు. వీలైనంత వరకు అందరూ ఇలాగే చేయండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలానే చాలా మంది స్వదేశి వస్తువులను ఉపయోగిస్తున్న సరే బయటకి చెప్పరు, ఇక పై అలా కాకుండా మనం స్వదేశి ఉత్పత్తులను వాడుతున్నాము అని సగర్వంగా బయటకి వెల్లడించాలని శిరీష్ అన్నారు.
ఈ సోషల్ మూమెంట్ తరువాత దశలో భాగంగా అల్లు శిరీష్ తన సన్నిహితులకు, కొందరు ఫిల్మ్, స్పోర్ట్స్ సెలెబ్రెటీలకు దేశీయ ఉత్పత్తులతో కూడిన గిఫ్ట్ హాంపర్స్ పంపించి, వారిని కూడా ఈ గో లోకల్ బీ వోకల్ ఉద్యమం లో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. శిరీష్ ఛాలెంజ్ విసిరిన సినీ తారల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, రకుల్ ప్రీత్, అను ఇమ్మానుయేల్, రాశి ఖన్నా, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఉన్నారు. వీరితో పాటు ప్రముఖ బ్యాట్మెంటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కూడా ఉండటం విశేషం. ఈ సెలెబ్రెటీస్ అంతా గిఫ్ట్ హంపర్ అందుకోవడమే కాకుండా ఇలాంటి అద్భుతమైన మూమెంట్ కి నాంది పలికిన అల్లు శిరీష్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
అల్లు శిరీష్ గో లోకల్ బీ వోకల్ మూమెంట్ లో తారలకు పంపిన గిఫ్ట్ హంపర్ లో ఉన్న దేశీయ ఉత్పత్తుల జాబితా :: పల్ప్ ఇండియా (పక్క హైదరాబాద్ తయారీ), ఉస్తారా – కొలోన్, బొంబాయి షేవింగ్ కంపెనీ ఫేస్ వాష్ అండ్ మాస్క్, గ్రీన్ స్నాక్ కో – క్వినోవా పఫ్స్ అండ్ స్నాక్స్, కవర్ ఇట్ అప్ : సెల్ ఫోన్ కవర్లు, ఆర్గానిక్ ఇండియా : ఆయుష్ క్వాత్, గ్రీన్ టీ, మగ్స్, బాడీ ఆయిల్.











