అల్లు శిరీష్ రెండేళ్ళ క్రితం ‘ఏబీసీడీ’ అనే సినిమాలో కనిపించాడు. మలయాళ రీమేక్ అయిన ఆ మూవీ రిజల్ట్ తేడా కొట్టడంతో.. ఆ తర్వాత టాలీవుడ్ లో శిరీష్ ఐపు, జాడ లేడు. అదే ఆఖరి సినిమానా, లేక కొత్త గా ఏదైనా సినిమాలో నటిస్తున్నాడా అనే విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ గా అల్లు శిరీష్ గురించి తాజా సమాచారం లభించింది. నేడు అతడి పుట్టిన రోజు సందర్బంగా అల్లు శిరీష్ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ విత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రెండు విడుదలయ్యాయి. సినిమా పేరు ‘ప్రేమకాదంట’.
మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ‘ప్రేమకాదంట’ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ‘జతకలిసే, విజేత’ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్స్ కి విశేషమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ పోస్టర్స్ కూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
సినిమా టైటిల్ ను బట్టి, విడుదలైన పోస్టర్స్ ను బట్టి.. ఇందులో అల్లు శిరీశ్, అనూ ఇమ్మాన్యుయేల్ లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటారని, అందుకే వారు దాన్ని ప్రేమ అనుకోరని అర్ధమవుతోంది. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఇతర తారాగణం గురించి మేకర్స్ తెలపలేదు. మరి ప్రేమంట సినిమా శిరీష్, అనూ ఇమ్మాన్యువల్ కెరీర్ కు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Excited and happy to share the 2 first looks of "Prema Kadanta". #PremaKadanta @anuemmanuel @ga2pictures @rakeshsashii pic.twitter.com/N1OMpJOtR9
— Allu Sirish (@AlluSirish) May 30, 2021