ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు – ORR ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏకంగా రూ.25,000 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కూడా 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
140 మీటర్ల వెడల్పు – 5 జిల్లాలకు అనుసంధానం
భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ORRను 140 మీటర్ల భారీ వెడల్పుతో డిజైన్ చేశారు. ఈ కారిడార్ ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఏలూరు జిల్లాల మీదుగా సాగనుంది. మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తూ, భవిష్యత్తులో రహదారి, రైలు మార్గాల విస్తరణకు అనుకూలంగా ఉండేలా ఈ ప్లాన్ రూపొందించారు.
పారిశ్రామిక ప్రగతి – వేలాది మందికి ఉపాధి
ఈ ఔటర్ రింగ్ రోడ్డు రాకతో రాజధాని ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. అమరావతికి ప్రధాన జాతీయ రహదారులతో ప్రత్యక్ష అనుసంధానం పెరగడం వల్ల సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుంది. రహదారికి ఇరువైపులా పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటై వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ఈ 25,000 కోట్ల ORR ప్రాజెక్ట్ గేమ్‌చేంజర్‌గా నిలవనుంది. 5 జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఇది బలమైన పునాదిగా మారనుంది. త్వరలోనే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పనులను పట్టాలెక్కించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి కీలక అడుగులు పడడంతో వైసీపీ అధినేత జగన్ మావిగన్ కలలకి శాశ్వతంగా బ్రేక్ పడనుంది..











