ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందించే క్యారెట్‌ను కచ్చితంగా తినాల్సిందే. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. మరికొందరు క్యారెట్‌ను నేరుగా తినేస్తారు. ఎలా తిన్నా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్ అసలు దరిచేరవు.
చాలామంది కంటి సమస్యలతో భాదపడుతుంటారు. అలాంటివాళ్లు క్రమం తప్పకుండా క్యారెట్ తినాలని చెబుతున్నారు డాక్టర్లు. క్యారెట్‌లో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. రోజుకో క్యారెట్ తింటే బీపీ కూడా అదుపులోకి వస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కూడా క్యారెట్ బాగా పనిచేస్తుంది.
క్యారెట్ శరీరాన్ని కూడా ఆరోగ్యంగానూ ఉంచుతుంది. క్యారెట్ లో బీటా కెరొటిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది చర్మానికి ఎంతో మంచి చేస్తుంది. ఈ బీటా కెరొటిన్ చర్మానికి హానిచేసే అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కాపాడుతుంది. రోజుకో క్యారెట్ తింటే చర్మం కాంతివంతంగా మారుతుందని పలు సర్వేలు కూడా స్పష్టం చేశాయి.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీరం వాపులకు గురి కాకుండా ఉంటుంది. బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ బి6, కె, పొటాషియం, పాస్ఫరస్ లు ఎముకలను బలంగా మారుస్తాయి. నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రోజుకో జ్యూస్ తాగితే.. గుండె కూడా పదిలంగా ఉంటుంది.
Must Read ;- పాలలో శరీరానికి అవసరమైన ఖనిజాలు,విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి