Amazon Prime And Aha In Talks With Samantha For OTT Projects
ఎలాంటి గాయాన్ని అయినా మాన్పే గుణం ఒక్క కాలానికే ఉంది. జీవితంలో చేదు అనుభవాలు సర్వసాధారణం. చైతు నుంచి విడిపోయాక సమంత పూర్తిగా సినిమాల వైపే దృష్టిపెట్టింది. ముంబైలో ఆమె సెటిల్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఆమె హైదరాబాద్ లోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు తల్లి కూడా సమంత దగ్గరకే వచ్చి ఉంటున్నట్టు తెలుస్తోంది. ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి ఆమె సంతకం చేసింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ నవంబరు నుంచి ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు. హరి, హరీష్ అనే ఈ ఇద్దరినీ ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన శాకుంతలం సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇది కాకుండా ఓటీటీలో ఆమె బిజీగా ఉన్న సంగతి తెలిసిదే.ది ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్ తో మంచి స్వింగ్ లోకి వెళ్లిపోయింది. తాజాగా ఆమెతో కొన్ని ప్రాజెక్టుల కోసం అమెజాన్ ప్రైమ్, ఆహా సంస్థలు సమంతతో చర్చలు జరుపుతున్నాయి.
Amazon Prime And Aha In Talks With Samantha For OTT Projects
ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు మరో వెబ్ సిరీస్ ను సమంతతో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీని కోసం ఆమెకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు కూడా తెలిసింది. ఆమెజాన్ దూకుడు అలా ఉంటే ప్రాంతీయ ఓటీటీ ఆహా కూడా సమంతను ఒప్పించే ప్రయత్నాల్లో ఉంది. గతంలో ఆమె ఆహా కోసం సామ్ జామ్ అనే ఓ ప్రోగ్రామ్ చేసింది. దాని రెండో సీజన్ ను తీసుకురాలేదు. దాని స్థానంలోనే ఫ్లాగ్ షిప్ షో కోసం ఆమెను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సమంత ఆహా కోసం చేసేది రియాలిటీ షోనా? వెబ్ సిరీసా? అన్న దానిపై స్ఫష్టత లేదు. సమంత ఏమేం చేయబోయేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.











