Ambati Rambabu In Another Controversy :
ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధికార ప్రతినిధి కాకుండా గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆ పార్టీ కీలక నేత అంబటి రాంబాబు మరో వివాదంలో చిక్కుకుపోయారు. ఓ మహిళతో వ్యభిచారం కోసం బేరమాడుతున్న అంబటి ఫోన్ కాల్ అంటూ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఆడియో ఇప్పుడు పెను కలకలమే రేపుతోంది. ఏ విషయంపై అయినా తనదైన స్టైల్లో సెటైర్లు సంధించే సత్తా కలిగిన అంబటి.. గతంలోనూ ఓ మహిళ విషయంలో పెను వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు వచ్చిన ఓ మహిళ.. అంబటిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. నాడు ఆ వ్యవహారం పెను కలకలమే రేపింది. అయితే అదే మహిళను వేరే ఛానల్ కు రప్పించగలిగిన అంబటి.. అదే మహిళతో అసలు విషయం ఇదేనంటూ చెప్పించి దాని నుంచి చాలా ఈజీగానే బయటపడిపోయారు.
ఏం కావాలో ఎలా చెప్పేది?
తాజాగా గుంటూరుకు చెందిన ఓ మహిళతో అంబటి రాంబాబు ఫోన్ లో మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ వీడియోలో సదరు మహిళ.. మసాజ్ చేసేందుకు యువతులను, తక్కువ వయస్సు కలిగిన మహిళలను పంపుతున్నట్లుగా ఒప్పుకుంది. అంతేకాకుండా మసాజ్ చేసేందుకు వచ్చే అమ్మాయిలు ఏం చేయమన్నా చేస్తారంటూ కూడా ఆ మహిళ చెప్పడంతో పాటుగా అంబటి రాంబాబుకు ఏం కావాలో చెప్పాలంటూ కోరింది. మసాజ్ ఒక్కటే చేస్తుందా? ఇంకేం చేయదా? అంటూ అంబటి అడిగితే.. మీకేం కావాలో చెప్పండి అంటూ సదరు మహిళ ప్రశ్నించింది. అంతేకాకుండా తాను పంపే మహిళలు ఏం చేయమన్నా చేస్తారని, అయితే మీకు ఏమేం కావాలో మెన్షన్ చేయండి అంటూ అంబటిని ఆమె పదే పదే అడగడం గమనార్హం. అయితే రాజకీయాల్లో ఎదురులేని గళంగా పేరు తెచ్చుకున్న అంబటి.. తనకు తన వద్దకు వచ్చే మహిళ నుంచి ఏమేం కావాలన్న అంశాన్ని మాత్రం చెప్పలేనులే అంటూ పేర్కొనడం గమనార్హం.
అంబటి ఏమేం అడిగారంటే..?
తన వద్దకు పంపే మహిళను తన ఊరికే పంపాలని అంబటి కోరగా.. మీరు గుంటూరుకు రారా అంటూ ఆ మహిళ ప్రశ్నించింది. గుంటూరుకు వస్తా గానీ.. ఇంటిలో ఆ మహిళతో ఎలా కుదురుతుంది అంటూ అంబటి చెప్పారు. మరి మీరు చెప్పిన ఊరికి పంపితే సరిపోతుందా? అక్కడ కుదరుతుందా? అని ఆమె అడగ్గా.. అద్దె ఇల్లు పెద్దగా ప్రాబ్లమేమీ రాదులే అంటూ అంబటి పేర్కొన్నారు. ఇక తన వద్దకు పంపే అమ్మాయి ఏమేం చేస్తుందని ప్రశ్నించిన సందర్భంగా అంబటి మరింత మేర సరసం ఆడారు. తన వద్దకు వచ్చే అమ్మాయి ఎవరని, వయసు ఎంత? అని, చెప్పినవన్నీ చేస్తుందా? అని బాగుంటుందా? అని.. ఇలా అన్నీ నాటు ప్రశ్నలే వేశారు. దీనికి సమాధానంగా అంబటి వద్దకు పంపే మహిళ పాత గుంటూరుకే చెందిన ముస్లిం యువతి అని, వయసు 25 అలా ఉంటుందని పేర్కొంది. మొత్తంగా మూడు నిమిషాల కంటే కాస్తంత తక్కువే ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఈ వీడియో నిజమే అయితే అంబటికి మంత్రి పదవి ఖాయమేనంటూ సెటైర్లు పడిపోతున్నాయి.
నాపై కుట్ర జరుగుతోంది
అయితే ఈ ఆడియోపై అంబటి రాంబాబు స్పందించారు. తన నియోజకవర్గ ప్రజలను, వైసీపీ కేడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగా ఇలాంటి వీడియోలు పుట్టుకొస్తున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో కూడా ఇదే మాదిరిగా ఓ ప్రముఖ ఛానెల్ తనను బదనాం చేసేందుకు యత్నించిందని, అయితే దానిపై తాను న్యాయ పోరాటం చేసి గెలిచానని, కోర్టుల్లోనూ ఆ ఛానెల్ దే తప్పు అని రుజువైందని కూడా ఆయన పేర్కొన్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో 10 నుంచి 15 రోజులుగా సర్వ్యులేట్ అవుతోందని, అందులో తన వాయిస్ ను ఇమిటేట్ చేసి మాట్లాడారని ఆయన ఆరోపించారు. ఈ తరహా కుట్రల కారణంగా సోసల్ మీడియాలోకి వచ్చి పడుతున్న వీడియోలను నమ్మవద్దని ఆయన తన నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కేడర్ కు సూచించారు.
Must Read ;- పోస్టల్ బ్యాలెట్ గుట్టురట్టు.. బాలినేని బుక్కేనా?











