అంబటి రాంబాబు..జగన్‌కు ఎంత వీరవిధేయుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీ దారుణంగా ఓడిన తర్వాత జగన్ కోసం మీడియా ముందుకు వచ్చి నోరు పారేసుకునే అతికొద్దిమందిలో అంబటి ఒకరు. సోషల్‌మీడియాలోనూ పార్టీ కోసం యాక్టివ్‌గా పని చేస్తున్నారు అంబటి. ఐతే అలాంటి అంబటికి జగన్ షాకిచ్చారు. అంబటిని సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి గతంలోనే పీకేసిన జగన్..తాజాగా గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జిగా నియమించారు.
2014 నుంచి సత్తెనపల్లి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు అంబటి. 2019లో సత్తెనపల్లి నుంచి ఆయన విజయం సాధించారు. ఐతే మొన్నటి ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో దారుణంగా ఓడిపోయారు. సత్తెనపల్లిలో అంబటిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సొంత పార్టీలోనూ ఆయనపై మంచి అభిప్రాయం లేదు. దీంతో ఆయనను సత్తెనపల్లి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు జగన్. కొత్తగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డికి సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించారు.
గుంటూరు పశ్చిమలో వైసీపీకి ధీటైన నేత ఎవరూ లేరు. అప్పిరెడ్డి ఉన్నా ఆయనలో జగన్‌కు ఎమ్మెల్యే అభ్యర్థి కనిపించడం లేదు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇప్పటికే జగన్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే అంబటిని గుంటూరు వెస్ట్ ఇన్‌ఛార్జిగా నియమించారు. అలా అని రాబోయే ఎన్నికల్లో అంబటికే టికెట్ ఇస్తారన్న నమ్మకం లేదు. ఆ సమయానికి జగన్ ఎవరికి టికెట్ ఇవ్వాలనుకుంటే వారికే ఇస్తారు. అప్పటివరకూ ఆ నియోజకవర్గానికి ఓ బాధ్యుడు ఉండాలి కాబట్టి ఆ బాధ్యతలను అంబటికి అప్పగించారు జగన్.
2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ తరపున విడుదల రజిని పోటీ చేశారు. కూటమి అభ్యర్థి గల్లా మాధవి చేతిలో విడుదల రజిని ఘోరంగా ఓడిపోయారు. దీంతో అక్కడ తన పప్పులు ఉడకవని తెలిసిన రజిని తిరిగి చిలకలూరిపేటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే అంబటిని ఖాళీగా ఉంచడం లేక గుంటూరు వెస్ట్ బాధ్యతలు అప్పగించారు జగన్. 2014 నుంచి ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తోంది. గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోట. 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలి గిరిధర్ రావు, 2024లో గల్లా మాధవి టీడీపీ టికెట్‌పై గెలిచారు. అలాంటి స్థానంలో అంబటి ఎలా రాణిస్తారో చూడాలి మరీ.











