Amul Believed In Jagan And Fell Into Trouble :
అమూల్.. పేరు వింటేనే పాల వెల్లువ కళ్ల ముందు కదలాడుతుంది. తెలుగు ప్రజలకు విజయా డెయిరీ ఎలాగో.. గుజరాత్ వాసులకు అమూల్ అలాగే. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా అమూల్ కు మంచి పేరే ఉంది. ఆ పేరు కాస్తా.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను నమ్మిన కారణంగా మసకబారుతోందనే చెప్పాలి. పాల ఉత్పత్తిదారులకు అత్యధిక రేట్లు ఇస్తున్న సంస్థగానూ అమూల్ కు గుడ్ నేమ్ ఉంది. ఇక పాలు, ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా అమూల్ మంచి స్టాండర్డ్స్ నే పాటిస్తోంది. ఇలాంటి సంస్థ ఎక్కడికి వెళ్లినా కూడా పెద్దగా వ్యతిరేకత ఏమీ ఉండదు. అమూల్ కు పాలు పోసేందుకు పాల ఉత్పత్తిదారులు క్యూలు కడతారు. అయితే ఎందుకనో గానీ.. ఏపీలో సీఎం జగన్ ఆహ్వానం మేరకు రాష్ట్రంలోకి ప్రవేశించిన అమూల్ కు ఆది నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. తాజాగా ఆ సంస్థపై రైతులు కూడా నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అంతేకాదండోయ్.. అమూల్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కానే లేదు.. అప్పుడే ఆ సంస్థ ఓపెన్ చేసిన పాల సేకరణ కేంద్రాల్లో సగానికి పైగా మూతపడిపోయాయి.
అమూల్ బిల్లులు చెల్లించట్లేదా?
పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న అమూల్.. ఇతర ప్రైవేట్ కంపెనీల కంటే కూడా అధిక రేట్లను చెల్లిస్తోంది. ఇదే మాటను ఏపీలోకి ప్రవేశించే సమయంలో ఇదే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులు ఘనంగానే ప్రకటించుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ డెయిరీని మూయించేందుకే అమూల్ ను జగన్ రాష్ట్రానికి తీసుకొచ్చారన్న ఆరోపణలు కూడా వినిపించాయి కదా. ఇందులో భాగంగా అమూల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇతోదికంగా సహకారం అందించింది. వెటర్నరీ, వెలుగు, సహకార శాఖల సిబ్బంది నిత్యం అమూల్ కు పాలు పోయించే పనిలోనే నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ అమూల్ పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. తొలుత బాగానే ఉన్నా.. ఆ తర్వాత అమూల్ నుంచి పాల బిల్లులు రావడం లేదంటూ పాల ఉత్పత్తిదారులు ఆందోళనలకు దిగడం మొదలైంది. ఈ క్రమంలోనే అమూల్ కు పాలుపోసే రైతుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. వెరసి అమూల్ పాల సేకరణ కేంద్రాల సంఖ్య కూడా సగానికి పైగా తగ్గిపోయింది. అత్యుత్సాహంతో ప్రభుత్వమే తెరిపించిన ఈ కేంద్రాలన్నీ మూతపడిపోతుంటే.. ఎవరిని నిందించాలో కూడా అమూల్ తెలియని పరిస్థితి. అయినా తాను తీసుకున్న పాలకు బిల్లులను అమూల్ చెల్లించడం లేదనే మాట ఇప్పటిదాకా వినిపించనే లేదు. మరి ఏపీలో ఆ సంస్థపై ఈ మరక పడటానికి గల కారణాలేమిటన్నది అంతు చిక్కడం లేదు.
అమూల్ పతనానికి ఇదే నిదర్శనం
అమూల్ నిజంగానే ఏపీలో నిండా కష్టాల్లో మునిగిపోయిందా? అని ఎవరు కూడా అనుమానపడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే. అమూల్ నిండా మునగడమే కాదు కదా.. త్వరలోనే ఏపీ నుంచి పెట్టేబేడా సర్దడం కూడా ఖాయమేనని చెప్పక తప్పదు. ప్రకాశం జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణ, అమూల్ స్థితి ఏమిటన్నవ వివరాల్లోకి వెళితే.. జిల్లాలో రోజువారీ పాల ఉత్పత్తి అంచనా దాదాపుగా7 లక్షలు లీటర్లుగా ఉంది. ఇందులో గృహ అవసరాల కోసం2.50 లక్షల లీటర్లు వినియోగిస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు 50 నుంచి 75 వేల లీటర్ల మేర పాలను సేకరిస్తున్నారు. ఇక ప్రైవేట్ డెయిరీలకు సుమారు 4 లక్షలు లీటర్ల మేర పాలు వెళుతున్నాయి. ఇందులో అమూల్ కు ప్రస్తుతం అందుతున్నది కేవలం 7 వేలు లీటర్లు మాత్రమే. అమూల్ కార్యకలాపాలు మొదలైన సమయంలో రోజుకు 23 వేలకు మేర పాలు చేరేవి. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 7 వేలకు దిగిపోయింది. ఫలితంగా పాల సేకరణ కోసం జిల్లాలో అమూల్242 సెంటర్స్ ప్రారంభించగా.. వాటిలో ఇప్పుడు కేవలం 131 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ గణాంకాలు చూస్తుంటే.. జగన్ ను నమ్మిన అమూల్ నిండా కష్టాల్లో మునిగినట్టే కదా.
Must Read ;- మళ్లీ జగన్ బాదుడు.. జనం బెంబేలు