130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ ఒక లెక్క కాదని విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళనలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 32మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోడీపై జనం తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అమరనాథ్ హెచ్చరించారు.
ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని నిలిపివేయాలని ప్రధాని మోడీకి లేఖ రాశారని ఎమ్మెల్యే అమర్ నాథ్ గుర్తుచేశారు. ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. తమ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని అమర్ నాథ్ గుర్తుచేశారు.