అధికారపార్టీలో మాఫియా రాజ్యమేలుతోంది..!
అధికారపార్టీలో మాఫియా రాజ్యమేలుతోందని సాక్ష్యత్తు సొంతపార్టీ నాయకులే ప్రత్యక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అధికారపార్టీ నాయకులు కూటములుగా ఏర్పడి చీకటి వ్యాపానికి తెరతీశారని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, నెల్లూరు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా రెచ్చిపోతున్నా.. జగన్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనం. అయితే ప్రతిపక్షాలు నిత్యం పోలీసు వ్యవస్థపై, పనితీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపధ్యంలో బుధవారం పోలీసుల తీరుపై ఆనం చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇవే కామెంట్స్ స్టేట్ వైడ్ గా చర్చనీయాంశంగా మారాయి.
మాఫియాతో పోలీసు శాఖ చేతులు కలిపింది..!
రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న మాఫియాకు లోకల్ పోలీసులు కూడా చేతులు కలిపారని ఎమ్మెల్యే ఆనం రామనారామణ రెడ్డి ఆరోపించారు. లోకల్ మాఫియా హవా గట్టిగా నడుస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మాఫియాతో పోలీసులు అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందని, లోకల్ మాఫియా జోరు బాగా పెరిగిందన్నారు. పోలీసులు న్యాయం చేస్తారని ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా పోతుందని వాపోయ్యారు. పోలీసులతో సామాన్యులకు భద్రత లేదని అభిప్రాయపడ్డారు ఆనం. గతంలో కూడా పోలీసుల తీరుపై ఇదే జిల్లాకు చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై పోలీసులు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చేతనైతే ధాన్యం కొనని మిల్లర్లపైనా, దళారులపైనా కేసులు పెట్టాలని పోలీసులను ఒక రేంజ్ లో తిట్టిపోశాడు ఎమ్మెల్యే నల్లపరెడ్డి! ఈ వ్యాఖ్యలు మంత్రులు అనిల్, గౌతమ్ రెడ్డిల సమక్షంలో చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తగా పెద్ద చర్చకు దారితీశాయి.
Must Read ;- మోడీ మోడలొంచుతామని .. కాళ్లుపట్టుకుంటారేం?!