కార్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండీ.. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ప్రతిఒక్కరూ కార్లను ఇష్టపడతారు. ఇక సెలబ్రిటీలు, ధనవంతులయితే రకరకాల కార్లలో తిరుగుతూ ఆకట్టుకుంటారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించినట్టు ఉన్నాడు. తన కారుకు గోల్డ్ కోటింగ్ వేసి రోడ్లపై దూసుకుపోతున్నాడు. అది చూసినా చాలామంది వావ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. రోడ్డుపై దూసుకుపోతున్న బంగారు కారు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఎంతోగానో ఆకట్టుకుంది. ‘ప్యూర్ గోల్డ్ ఫెరారీ కార్‌తో ఇండియన్-అమెరికన్’ అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఎందుకు సోషల్ మీడియాతో వైరల్ అవుతుందో నాకు అర్థం కాలేదని, ఒకవేళ మీరు ధనవంతులైతే డబ్బును ఇలా ఖర్చు చేయకూడదని, ఇదోక మంచి పాఠం’’ అని ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్ర పోస్టు పట్ల నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇది నిజమైన బంగారు కారు కాదని, అది కూడా తెలియదా అని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఆనంద్ మహీంద్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. డబ్బుంటే ఖరీదైన కార్లు కొనే బదులు పేదలకు పంచాలని, నిర్లక్ష్యంగా ఖర్చుచేయవద్దని కామెంట్ చేస్తున్నారు.
Must Read ;- జోమాటోకు ‘పేటీఎం’ అదిరిపోయే గిఫ్ట్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
I don’t know why this is going around on social media unless it is a lesson on how NOT to spend your money when you are wealthy… pic.twitter.com/0cpDRSZpnI
— anand mahindra (@anandmahindra) July 19, 2021











