యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ ఓ వైపు బుల్లితెర మీద మరో వైపు వెండితెర మీద సందడి చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వెండితెర మీదకి వెళ్లినా.. బుల్లితెరను మాత్రం వదలలేదు. ఎన్నో విభిన్న పాత్రలను చేయాలనుకుంటుంది. అయితే.. అనసూయ కెరీర్ లో మరిచిపోలేని సినిమా.. ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అంటే ఠక్కున గుర్తుకువచ్చేది రంగస్థలం. ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అదరగొట్టేసింది. దీంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తుంది. అయితే.. ఈ అమ్మడు సినిమాల కంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు, కామెంట్స్ వలనే ఎక్కువుగా వార్తల్లో ఉంటుంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. పొట్టిగా ఉండే డ్రెస్ వేసుకుంటే తప్పేంటి..? అని ప్రశ్నిస్తుంది. అలాంటి డ్రెస్ లపైనే ఫోకస్ ఎందుకు పెడతారు.? అని అడుగుతుంది. అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది వ్యక్తిగత విషయం. అయితే.. అనసూయ పొట్టి డ్రెస్ వేసుకున్న ప్రతిసారీ ట్రోలింగ్ కి గురవుతుంటుంది. అదే కాన్సెప్ట్ తో జబర్ధస్త్ పొగ్రాంలో స్కిట్ చేశారు. అనసూయ మనసులో భావాలను వ్యక్తం చేయడానికి ఈ స్కిట్స్ ని వాడుకుంటోంది.
అనసూయకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త, పిల్లల పోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తుంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. రంగస్థలంలో అనసూయ క్యారెక్టర్ ఇచ్చిన సుకుమారే.. అనసూయకు పుష్ప మూవీలో కూడా అవకాశం ఇవ్వడంతో ఈ సినిమాలో కూడా మంచి పేరు తీసుకువచ్చే పాత్ర చేస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో..? ఎంత వరకు మెప్పిస్తుందో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- అసూయ పడేంత అందంగా అనసూయ