ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేకులేసిన సంగతి తెలిసిందే. అలాగే.. అదే కారణంగా ఈ సినిమా విడుదలకు కూడా అడ్డంకులేర్పడే అవకాశాలున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా పుష్ప మూవీ రూపొందుతోంది.
ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ చెలరేగుతుండగా.. విలన్ గా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ అదరగొట్టబోతున్నాడు. అలాగే.. ఇందులో గిరిజన యువతిగా రష్మికా మందన్న నటిస్తుండగా.. ఆమెకు సోపోర్టింగ్ గా నిలిచే మరో గిరిజన మహిళ పాత్రను హాట్ యాంకర్ అనసూయ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఆల్రెడీ అలాంటి పాత్రనే ‘రంగస్థలం’లో చేసింది అనసూయ. ఇప్పుడు ‘పుష్ప’ లో కూడా అదే తరహా కాస్ట్యూమ్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించనుండడం విశేషంగా మారింది. ఇటీవల మీడియా ఇంటరేక్షన్ లో తాను పుష్పలో ఓ ప్రత్యేక మైన పాత్రను పోషిస్తున్నానని, సినిమాకు తన పాత్ర హైలైట్ అని చెప్పింది. మరి రంగమ్మత్త పాత్రలాగానే పుష్పలో కూడా అనసూయ హైలైట్ అవుతుందేమో చూడాలి.











