రష్మీకి బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉంది. బుల్లితెరపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ముద్దు ముద్దు మాటలతో పొద్దు తెలియకుండా చేయడం ఈ అమ్మాయి ప్రత్యేకత. బుల్లితెరపై యాంకర్ ఇలాగే ఉండాలనే పద్ధతులను పక్కన పెట్టేసి, యాంకరింగ్ కి గ్లామర్ టచ్ ఇచ్చే సాహసం చేసి సక్సెస్ అయింది. అంతేకాదు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో వెండితెరపై కూడా అవకాశాలను సంపాదించుకుంది. అక్కడ కూడా తన మార్కును చూపించింది. అయితే ఇటీవలే సినిమాల పరంగా కాస్త దూకుడు తగ్గించింది. మరి అందులో అర్థం ఏమిటో .. అంతరార్థమేమిటో అమ్మడికే తెలియాలి.
ఇక రష్మీ ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ స్టేజ్ పై ఎంత హుషారుగా ఉంటుందో .. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటో షూట్లతో .. తన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేయడంలో బిజీబిజీగా ఉంటుంది.తాజాగా ఆమె బ్లూ కలర్ శారీ .. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఈ అమ్మాయి గంధంతో చెక్కిన శిల్పంలా కనిపిస్తోంది .. ఓపలేని వయ్యారాలతో ముచ్చటగా మురిపిస్తోంది. మూగభాషలో మౌనరాగాలను వినిపిస్తోంది.
ఇంత అందం వెండితెరపై వెన్నెల కురిపించడం కొనసాగించవలసిందేనని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే రష్మీ ఇటీవల కాలంలో సినిమాలు చేయడం తగ్గించింది. అదివరకు హారర్ కథలను తన గ్లామర్ తో మిక్స్ చేసి అందించింది. ఈ తరహా కథల్లో ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను కూడా పోషించింది. అందువలన ఆమె మళ్లీ సినిమాలు చేయాలని అభిమానులు భావిస్తున్నారు. అనసూయ మాదిరిగా వెండితెరపై బంగారంలా మెరవాలని ఆశపడుతున్నారు. మరి ముద్దబంతిలాంటి ఈ పిల్ల వాళ్ల ముచ్చట తీరుస్తుందో లేదో చూడాలి.