ఏపీలో పోలీసుల ఓవరాక్షన్.. ఉన్నతాధికారుల వత్తిడి మేరకేనా..? లేక హిడెన్ ఎజెండాతో అలా చేస్తున్నారా…? అన్నదానిపై క్లారిటీ లేనప్పటికీ చివరకు కొత్త చిక్కులు కొనితెచ్చుకోక తప్పవన్నట్ల కనిపిస్తోంది.
ఏపీలో బాస్ ఏం చెప్తే.. పోలీసుల అధికారులు అలా మూవ్ అవుతున్నారు. తాడేపల్లి సర్వేంట్ సజ్జల నొక్కె స్విచ్ పై ఆధారపడే ఏపీ పోలీసుల యాక్షన్ ఉన్నదన్నది విపక్షాలు చేస్తున్న విమర్శ. ఈ నేపధ్యంలో గన్నవరంలో పోలీసులు చేసి ఓవరాక్షన్.. మరోసారి ఖాకీల కండకావరం తేటతెల్లమైంది. ఒంటిపై ఖాకీ డ్రస్.., అధికార పార్టీ పెద్దల అండదండలు చాలు.. ఇక రెచ్చిపోవచ్చు అన్న ఏపీ పోలీసులు విధానాలు.. ఆ శాఖకు మాయని మచ్చగా మారాయి.
లా అండ్ ఆర్డర్ పరిరక్షించి.. ప్రజలను,పాలకులను రక్షించాల్సిన పోలీసులు.. సర్వీస్ రూల్స్ ను బ్రేక్ చేసి మరి.. వ్యక్తిగత భజనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వైకరి గతంలో దేశం ఎన్నడూ చూడని విధానం. దీన్ని ఐపీఎస్ లు సమర్దిస్తున్నారా..? లేక అన్ కండీషనల్ గా ఒప్పుకుని విధులు నిర్వర్తిస్తున్నారా..? అన్నది తెలియదు కానీ.., పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని చేజేతులారా దిగజార్చుకుంటున్నారన్నది సుస్పష్టం. విపక్షాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేసే సామాన్య ప్రజలపై పోలీసులు వారి హోదాలను మరిచి.., ఒంటికాలుపై ఎగబడుతున్నారు.
వైసీపీ నేతల మాట వినని వారిపై అక్రమ కేసులు, విచారణ పేరుతో బెదిరింపులు, దాడులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.., నిరసిన వ్యక్తం చేసినా.. ఖాకీ కన్నెర్ర చేస్తూ..ప్రజా హక్కులను తుంగలో తొక్కుతున్నారు. అధికారపార్టీ నేతలతో సమానంగా విపక్షాలపై కక్ష సాధిస్తున్న పోలసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సరిగ్గా అదే జరిగింది.
గన్నవరం ఎయిర్ పోర్టుకు విచ్చేసిన చంద్రబాబును చూసేందుకు పార్టీ ముఖ్యనేతలతో పాటు కేడర్ పోటీపడింది. దీంతో పోలీసులు అందర్నీ ఎయిర్ పోర్ట్ బయటనే నిలిపివేసి.. కొత్త రూల్స్ తీసుకొచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. అధికారపార్టీ నేతలకు ఒకలా ప్రోటోకాల్.., మాకు మరోలానా..? అంటూ నిలదీశారు. ఈ నేపధ్యంలో పోలీసులు, నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా రాజమండ్రి ములాఖత్ లకు వెళ్తున్న టీడీపీ మాజీ మంత్రులను కూడా రోడ్డుపై నిలిపివేసి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. దీనిపై కూడా టీడీపీ నేతల ఘాటుగానే స్పందించారు. ఇలా ప్రశ్నిస్తున్న ప్రజలు.., నిలదీస్తున్న విపక్షాలపై పోలీసులు విధులు, బాధ్యతలు మరిచి.. అడ్డుగోలుగా జులం చూపిస్తూ రాష్ట్రంలో అబాసుపాలౌతున్నారు.











