ఆంధ్రప్రదేశ్‌లో తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్లు 4 కోట్ల 4 లక్షల 41 వేల 378. ఇందులో పురుషుల సంఖ్య 1,99,66,737.. మహిళా ఓటర్ల సంఖ్య 2,04,71,506. ఇక థర్డ్ జెండర్ విషయానికొస్తే, 4,135 మంది ఉన్నట్లు జాబితాలో తెలిపారు. సర్వీస్ ఓటర్లు 66,844. కొత్తగా నమోదైన ఓటర్లు మొత్తం 4 లక్షల 25 వేల 860 మంది ఉన్నారు. తాజా జాబితా ప్రకారం పురుషుల కంటే 5,04,769 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
Must Read ;- ఏపీలో ఎన్నిరకాల ఓటర్లు ఎందరున్నారో తెలుసా?