ఏపీలో బాలింతలు, గర్భవతుల ఆరోగ్యం గాలో దీపంలా మారింది. ఇక జీవితంలో జగన్ అనే పొలిటిషన్ ను నమ్మం అని అంగన్ వాడీలు క్లారిటీ కొచ్చారు. అందుకే మెరుపు సమ్మెకు పిలుపు నిచ్చారు.
ఏపీలో జీతాల కోసం ఉద్యోగులు ఆందోళనలు.., ఉపాధి కోసం ప్రజల నిరసనలు.., ఉద్యోగాల కోసం యువత ఆగ్రహావేశాలను కలగొల్పి జగన్ రాజ్యంలో రాష్ట్రం రావణకాష్టంలా కాలుతోంది. గడిచిన నాలుగేళ్ళుగా అంగన్వాడీలకు పెండింగ్ లో ఉన్న అనేక డిమాండ్లు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆయా ప్రజా సంఘాలు మండిపడుతున్నారు. నేటి నుంచి మెరుపు సమ్మెకు దిగారు. ఏపీ వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్రాలలోని కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగారు.
2019 ఎన్నికల వేళా.. అంగన్ వాడీలకు జగన్ రెడ్డి అనేక హామీలను గుప్పించారు. వేతనాలు పెంపు.., గ్రాట్యుటీ అమలు చేస్తానని మాట తప్పారు. అదేవిధంగా అనాధిగా ఉన్న డిమాండ్లును కచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ను రూ.5 లక్షలకు పెంచాలని… ఆఖరి వేతనం 50 శాతం పెన్షన్ ఇవ్వాలని, ఆరోగ్య భీమా తదితర అంశాలను అమలు చేయాలని తదితరాలపై అంగన్ వాడీలు నిరసన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు తోపాటు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టారు. వీరికి సీఐటీయూ, ఎఐటీయూసీ, ఐఎఫ్ టీయూ, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.
ఇదిలా ఉంటే 2014 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్ వాడీలకు కనీస వేతనం ఇచ్చి ఆదుకున్నారు. దాదాపు లక్షా 20 వేల మంది అంగన్ వాడీ వర్కర్లు ఉండగా.. 4,200 ఉన్న జీతాన్ని 7 వేలకు పెంచారు. ఆ తరువాత 2019 ఎన్నికల ముందు అంగన్ వాడీ వర్కర్లకు 10 వేలు, ఆయాలకు 6 వేలు పెంచిన ఘనత కూడా చంద్రబాబుదే. అయితే జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆ జీతాలకు చిల్లిగవ్వకూడా యాడ్ చేసి పెంచిన దాఖలాలు లేవని అంగన్ వాడీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.











