నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ముఖ్యంగా కామెడీకి కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న అనిల్.. బాలయ్యను ఈ చిత్రంలో ఎలా చూపించబోతున్నారు అని బాలయ్య అభిమానులే కాదు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో సినిమాలో బాలకృష్ణ పాత్ర గురించి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
తాజాగా బాలయ్యతో తాను చేస్తున్న సినిమాను గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ..తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని , “ఈ సినిమాలో బాలకృష్ణ యాభై ఏళ్లున్న తండ్రి పాత్రలో కనిపిస్తారని.. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోందని ఆయన తెలిపారు.మూవీలో తన మార్క్ కామెడీ తక్కువగానూ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ కుండబడ్డలు కొట్టేశాడు.
అంతేకాకుండా బాలకృష్ణను ఇంతవరకూ ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో ఆయనను చూపిస్తానని.. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.ఈ చిత్రం బాలయ్య కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలుస్తుందని చెప్పగలను అని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని తెలిపారు. ఒక రకంగా బాలకృష్ణతో తాను చేసేది సినిమా అనేదానికంటే ప్రయోగం అంటేనే కరెక్టుగా ఉంటుంది” అని దర్శకుడు అనిల్ అన్నారు.
మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..